రామాలయ భూమి పూజలోనూ సోషల్ డిస్టెనింగ్ తప్పలేదు

  • Published By: madhu ,Published On : August 5, 2020 / 12:31 PM IST
రామాలయ భూమి పూజలోనూ సోషల్ డిస్టెనింగ్ తప్పలేదు

కోట్లానుమంది ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం..శతాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్యలో రామాలయ భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం ఉదయం అయోధ్యకు మోడీ చేరుకున్నారు.



వివిధ ఆలయాలను దర్శించుకున్న అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోడీ కూర్చొని శంకుస్థాపనకు సంబంధించి పూజలు చేశారు. అర్చకులు వేద మంత్రాలు చదువుతూ…కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్ పాటిస్తూ పూజలు చేశారు.

భూమి పూజలో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆలయ ట్రస్టు ఛైర్మన్ గోపాల దాస్ మహరాజ్ పాల్గొన్నారు. ఈ ప్రాంతం అంతా..ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్ల కల నెరవేరుతున్న సందర్భంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో జై శ్రీరామ్..జై హనుమాన్ నినాదాలు, మంత్రాలతో మారుమోగుతున్నాయి.