అయోధ్య ఆలయ ప్రాంగణంలో సౌకర్యాలపై సలహాలివ్వండి

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2020 / 09:36 AM IST
అయోధ్య ఆలయ ప్రాంగణంలో సౌకర్యాలపై సలహాలివ్వండి

Ayodhya Ram Temple trust calls for ‘expert suggestions’ on facilities at temple complex అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే, రాముడి దర్శనానికి రోజుకు లక్ష నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​…. అందుకు తగిన విధంగా భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన, ఆలయం చుట్టూ ఉన్న 70 ఎకరాల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయటానికి ప్రజలు స్వచ్ఛందంగా సలహాలు, సూచనలు అందించాలని కోరింది​.



ఆలయ నిర్మాణ పురోగతిపై సమీక్షించేందుకు ఇటీవల సమావేశమైన ట్రస్ట్… పుష్కరణి, యాగ మండపం, అనుస్థాన్​ మండపం, కల్యాణ మండపాల నిర్మాణం సహా రామజన్మోత్సవం, హనుమాన్​ జయంతి, రామచర్చ, సీతా వివాహం వంటి ఉత్సవాల నిర్వహణపై ప్రజలు స్వచ్ఛందంగా తమ సలహాలు, నిర్మాణాల డిజైన్ల నమూనాలు అందించాలని కోరింది. ఈ నిర్మాణ ఆకృతుల నమూనాలు భారతీయ వాస్తుశాస్త్రం లేదా స్థాపత్య వేదం ఆధారంగా ఉండాలని సూచించారు.



ఆలయ ప్రాంగణంలోనే లైబ్రరీ, మ్యూజియం..శ్రీరామ డిజిటల్​ లైబ్రరీ, పరిశోధన కేంద్రంతో పాటు మ్యూజియం, 5వేల మంది వరకు కూర్చునేలా ఆడిటోరియం నిర్మాణానికి డిజైన్లు సూచించాలని కోరింది ట్రస్ట్​. రామకథను మంచి ఆడియో విజ్యువల్​ ఎఫెక్ట్స్​తో తిలకించేలా మినీ థియోటర్​, అయోథ్య చుట్టు పక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సలహాలు ఇవ్వాలని సూచించింది. వీఐపీలు, పూజారులు ఉండేలా అతిథిగృహాలు, ఓ గోశాలను నిర్మించాలని ప్రణాళిక చేస్తోంది ట్రస్ట్​ .



https://10tv.in/three-gang-of-men-arrested-burglary-of-22-temples-in-kurnool/
ఆలయ ప్రాంగణంలోనే గురుకుల పాఠశాల, 51 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఉండేలా నివాస గృహాలకు సైతం డిజైన్లు సూచించాలని కోరింది ట్రస్ట్​. నాల్​నీల్​ తిలా, సీతాకి రాసోయి, కుబెర్​ తిలా, అంగద్​ తిలా వంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో నిర్మాణాలు ప్రధాన ఆలయంతో అనుసంధానమయ్యేలా ఆకృతులు ఉండాలని సూచించింది.