అయోధ్య భూమిపూజకు వెళ్లను

  • Published By: nagamani ,Published On : August 3, 2020 / 11:59 AM IST
అయోధ్య భూమిపూజకు వెళ్లను

అయోధ్యలో శ్రీరాముడి మందిర నిర్మాణానికి ఆగస్టు 5న జరుగనున్న భూమి పూజ వేడుకకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత ప్రముఖులకు మాత్రమే ఈ వేడుకలకు ఆహ్వానాలు పంపించింది ట్రస్ట్. ఈ ఆహ్వానాన్ని బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి కూడా అందుకున్నారు. కానీ ఆరోజు అయోధ్యకు వెళతాను గానీ భూమిపూజ కార్యక్రమంలో మాత్రం పాల్గొనను ఉమాభారతి ట్విట్టర్ వేదికగా తెలిపారు.



అయోధ్యకు వెళ్లినా కూడా తాను భూమి పూజ జరిగే సమయంలో అక్కడికి వెళ్లడం లేదని..సరయూ నది తీరంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో నిబంధనల ప్రకారంగానే తాను దూరంగా ఉంటున్నానని స్పష్టంచేశారు. పూజ అయిపోయిన తరువాత అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ స్థలాన్ని దర్శించుకుంటానని స్పష్టం చేశారు.

ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా తో పాటు బీజేపీలో చాలామంది ప్రముఖ నాయకులు కరోనా బారిన పడ్డారు. నాయకులకు కరోనా సోకటంతో ప్రధాని మోడీ సహా తాను కూడా ఆందోళన చెందామని చెప్పారు. అందుకే 61 ఏళ్ల వయసున్న తాను వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు.



ఎంతోకాలంలో రామ మందిర నిర్మాణం కోసం ఎంతో ఆసక్తిగా..ఎదురుచూస్తున్నాం..కానీ ఆ వేడుకకు వెళ్లాలని ఉన్నా ప్రస్తుత పరిస్థితులు దానికి అనుకూలించేలా లేవు. ఈ క్రమంలో భూమి పూజకు వచ్చే వారు, ప్రధాని ఆరోగ్యం దృష్ట్యా మాత్రమే తాను దూరంగా ఉంటున్నానని..దీంట్లో మరేవిధమైన కారణాలు లేవని ఆమె స్పష్టంచేశారు. తాను భోపాల్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు రైలులో ప్రయాణిస్తానని..ఇప్పటికే ఆమెను అతిథుల జాబితా నుంచి దూరంగా ఉంచాలని ట్రస్ట్ సభ్యులకు తెలిపారు.

అయోధ్యలో రామ మందిరం కోసం బాబ్రీ మసీదును కూల్చివేసిన కేసులో ఉమా భారతి కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ కుర వృద్ధులు ఎల్.కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఈ కార్యక్రమం వీక్షించనున్నారు. వీరి వయసు రిత్యా అయోధ్యకు వెళ్లే అవకాశం లేకపోయింది. కానీ ఎంతోకాలంలో రామ మందిరం ఏర్పాటు కోసం ఎదురు చూసిన చాలామంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానందుకు కాస్త నిరాశగానే ఉన్నారు. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితుల రీత్యా ఇది తప్పనిసరి అని భావిస్తూ దూరంగా ఉంటున్నారు.