నమాజ్ చేసినట్లు ఆధారాలు లేవు: వరండాలో పూజలు చేశారు

  • Edited By: vamsi , November 9, 2019 / 05:39 AM IST
నమాజ్ చేసినట్లు ఆధారాలు లేవు: వరండాలో పూజలు చేశారు

వివాదాస్పద అయోధ్య కేసులో చారిత్రక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ తీర్పును చదివి వినిపించారు. ఐదుగురు జడ్జ్‌లు ఏకాభిప్రాయంతో తీర్పు తయారు చేసినట్లు న్యాయస్థానం చెప్పింది. స్థలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయగా.. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది కోర్టు. వివాదస్పద స్దలంలో పూజలు చేసే హక్కు నిర్మోహా అకాడకు లేదని తేల్చి చెప్పేసింది కోర్టు.

చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు చెప్పినట్లుగా జస్టిస్ గోగోయ్ స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని స్పష్టం చేశారు. మత విశ్వాసాలతో మాకు పనిలేదంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. తీర్పును సమతూకంగా ఇస్తున్నట్లు చెప్పారు.

బాబ్రీ మసీదు కట్టిన ప్రాంతంలో గతంలో ఓ పెద్ద కట్టడం ఉండేదని పురావస్తు శాఖ చెప్పింది. లోపల ఉన్న నిర్మాణం దేవాలయం అని కచ్చితంగా పురావస్తు శాఖ చెప్పలేదని తెలిపింది. రాముడు అయోధ్యలో జన్మించాడనడంపై మాత్రం ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసింది. దేవాలయ విధ్వంసంపై స్పష్టమైన ఆధారాలు లేవని, హిందువుల విశ్వాసం తప్పు అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది.

అయితే వరండాలో మాత్రం హిందువులు పూజలు చేసినట్లు ఆధారాలు ఉన్నట్లుగా చెప్పింది కోర్టు. 1856కి ముందు నమాజ్ చేసినట్లు ఆధారాలు లేవుని వెల్లడించారు న్యాయమూర్తి. ముస్లింలు మసీదును ఎప్పూడూ వదులుకోలేదు. స్ధలం ఎప్పడూ పూర్తిగా ముస్లింల ఆధీనంలో లేదు. స్ధలంపై పూర్తి హక్కులను ముస్లింలు నిరూపించుకోలేకపోయారు అని న్యాయమూర్తి చెప్పారు.