అయోధ్య కేసు : కమిటీ అంగీకరిస్తే..రివ్యూ పిటిషన్ – ముస్లిం పర్సనల్ లా బోర్డు

  • Published By: madhu ,Published On : November 9, 2019 / 06:35 AM IST
అయోధ్య కేసు : కమిటీ అంగీకరిస్తే..రివ్యూ పిటిషన్ – ముస్లిం పర్సనల్ లా బోర్డు

సుప్రీంకోర్టు తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది. తీర్పు నిరాశపరిచిందని, కానీ తీర్పును గౌరవిస్తామని లా బోర్డు ఛైర్మన్ జాఫర్ యాబ్ గిలానీ వ్యాఖ్యానించారు. తమకు ఐదు ఎకరాల స్థలం అక్కర్లేదని చెప్పారు. దేశ ప్రజలంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. కమిటీ అంగీకరిస్తే..రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని..ఇది తమ హక్కు అన్నారు. అంతేగాక..సుప్రీంకోర్టు నిబంధనలో ఉందని వ్యాఖ్యానించారు. 

తమ అంచనాలకు అనుగుణంగా కోర్టు తీర్పు లేదన్నారు. సిద్ధాంతపరంగా ఎక్కడా నిరూపించబడలేదన్నారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని, తాము తీర్పును స్టడీ చేసిన అనంతరం రివ్యూకు వెళ్లేదానిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. 
Read More : పంజాబ్‌లో మోడీ : గురుద్వారాలో ప్రార్థనలు
2019, నవంబర్ 09వ తేదీ శనివారం అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రామ మందిరానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకగ్రీవంగా తీర్పును సర్వన్నోత న్యాయస్థానం వెల్లడించింది. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి కోర్టు అనుమతినిచ్చింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును కేంద్రం ఏర్పాటు చేయాలని, 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్టుకు వెంటనే అప్పగించాలని, మసీదు నిర్మాణం కోసం వేరే స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సూచించింది. కేటాయించే బాధ్యత అయోధ్య ట్రస్టుదేనని వెల్లడించింది.