Ayushman Bharat Yojana: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

పేదల ప్రజలకు ట్రీట్మెంట్ నిమిత్తం ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.

Ayushman Bharat Yojana: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Ayushman Bharath

Ayushman Bharat Yojana: పేదల ప్రజలకు ట్రీట్మెంట్ నిమిత్తం ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ పరస్ఫర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందుకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది.

దీని రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ పాటిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవోకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. ఏప్రిల్‌ తర్వాత అమల్లోకి ఈ పథకం ద్వారా 26 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ కింద 84 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారని పేర్కొంది. కేంద్ర పథకం ద్వారా వచ్చే నిధులు తక్కువేనని వెల్లడించింది.

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3వేల 982 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో కరోనా కేసులు 5లక్షల 36వేలకు 766 చేరాయి.

గడిచిన 24 గంటల్లో కరోనాతో 27 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 3వేల 12 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48వేల 110 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4లక్షల 85వేల 644 మంది రికవరీ అయ్యారు.