Azam Khan: యూపీ సీఎం యోగిపై విధ్వేష వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే పదవి కోల్పోయిన అజాం ఖాన్

తొలుత 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్ లోక్‭సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తన సీటును వదులుకొని అదే రాంపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అప్పటికే ఆయన సీతాపూర్ జైలులో ఉన్నారు. జైలు నుంచే నామినేషన్ వేసి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.

Azam Khan: యూపీ సీఎం యోగిపై విధ్వేష వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే పదవి కోల్పోయిన అజాం ఖాన్

Azam Khan Disqualified As UP MLA

Azam Khan: విధ్వేష వ్యాఖ్యలో కేసులో సమాజ్‭వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్‭ను ఇప్పటికే జైలు శిక్ష ఖరారైన విషయం తెలిసిందే. అయితే ముందుగా ఊహించనట్టుగానే ఆయన తన అసెంబ్లీ సభ్యత్వాన్ని (ఎమ్మెల్యే పదవి) కూడా కోల్పోయారు. ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హుడిని చేస్తున్నట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా యూపీ అసెంబ్లీ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2013లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. క్రిమినల్ కేసులో దోషిగా తేలి రెండేళ్ల జైలు శిక్ష పడితే చట్ట సభల్లో ఉన్న సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. దీని ప్రకారం.. ఆయనకు రాంపూర్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. క్రిమినల్ నేరం కిందే రాంపూర్ కోర్టు ఈ శిక్ష విధించింది. దీనికి అనుగుణంగానే ఆయన తన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

తొలుత 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్ లోక్‭సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తన సీటును వదులుకొని అదే రాంపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అప్పటికే ఆయన సీతాపూర్ జైలులో ఉన్నారు. జైలు నుంచే నామినేషన్ వేసి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.

Rahul Gandhi Tweet: క‌ంగ్రాట్స్ ఎలాన్ మ‌స్క్..! ప్ర‌తిప‌క్షాల గొంతును అణ‌చివేయ‌ర‌ని ఆశిస్తున్నాం.. ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

2019లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎం యోగితో పాటు ఐఏఎస్ అధికారి ఆంజనేయ కుమార్ సింగ్, జిల్లా యంత్రాంగ కార్యాలయంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింల ఉనికికి క్లిష్టమైన వాతావరణాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన కోర్టు అజాం ఖాన్‭ను దోషిగా తేల్చింది.

చీటింగ్ కేసులో సుమారు 27 నెలలు జైలు శిక్ష అనుభవించిన అజాం ఖాన్.. మధ్యంతర బెయిల్ లభించడంతో ఈ యేడాది మే నెలలో విడుదలయ్యారు. ఉత్తరప్రదేశ్‭లో పేరున్న సీనియర్ రాజకీయ నేతల్లో అజాం ఖాన్ ఒకరు. ఇక సమాజ్‭వాదీ పార్టీలో అయితే ములాయం తర్వాత ములాయం లాంటి వారనే పేరు కూడా ఉంది. అయితే ఈయనను జైలులో వేయడం పట్ల సమాజ్‭వాదీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. విపక్షాల్ని అణచివేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశ పూర్వకంగానే అజాం ఖాన్‭ను జైలుకు పంపిందని అఖిలేష్ సహా అనేక ఇతర నేతలు అప్పట్లో విమర్శలు గుప్పించారు.

Mahendra Singh Vaghela: గుజరాత్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేత