Uttar Pradesh: అజాంఖాన్ గుండెల్లో చావు భయం.. అతీక్ అహ్మద్‭ హత్య తర్వాత పెరిగిన ఆందోళన

రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరపున ఆజం ఖాన్ ప్రచారం చేశారు. తన వ్యంగ్య ప్రకటనలకు ప్రసిద్ధి చెందిన ఆజం ఖాన్.. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను ఉద్దేశించి "రాజకీయ నపుంసకులు" అని అన్నారు

Uttar Pradesh: అజాంఖాన్ గుండెల్లో చావు భయం.. అతీక్ అహ్మద్‭ హత్య తర్వాత పెరిగిన ఆందోళన

Azam Khan

Uttar Pradesh: సమాజ్‭వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్‭కు చావు భయం పట్టుకుందట. తనను కూడా అతీక్ అహ్మద్ లాగే చంపేస్తారేమోనని అనిపిస్తుందంటూ స్వయంగా ఆయనే చెప్పడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల సందర్భంగా శనివారం రాంపూర్‭లో ఆయన ప్రచారం నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Karnataka Polls: ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్.. దేవెగౌడ, మోదీ చర్చలు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ, జేడీఎస్!

“నా నుంచి, నా పిల్లల నుంచి కావాలి? ఎవరైనా వచ్చి మమ్మల్ని తలపై తుపాకి పెట్టి కాల్చి చంపేస్తారేమో? బహుశా ఇంతకు మించి చెప్పేది కూడా ఏం లేదేమో? నిజాం-ఏ-హింద్‌ను రక్షించండి, చట్టాన్ని కాపాడండి, కొత్తగా మీరేదీ ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు. ముందు మీరు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి. మీరు ఎక్కడ ఆగిపోయితే అక్కడే ఉండండి. వెనుకకు మాత్రం వెళ్లొద్దు. వీలైనంత ముందుకు సాగడానికి ప్రయత్నించండి” అని యోగి ప్రభుత్వాన్ని ఉద్దేశించిన ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Sudan : సూడాన్‌లో కటిక చీకట్లోనూ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన భారత్ పైలట్లు

దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆజం ఖాన్ చాలా కాలం తర్వాత యూపీలో జరగనున్న పౌర ఎన్నికల ప్రచారానికి వచ్చారు. “మనం మన ఓటు వేస్తాము, అది మన జన్మహక్కు. కానీ దాన్ని కూడా మా నుంచి రెండుసార్లు లాక్కున్నారు. ఇక మరోసారి లాక్కుంటే, మీరు ఊపిరి పీల్చుకునే హక్కు కూడా ఉండనట్టే” అని విధ్వేష ప్రసంగాల కేసులో ఆయన మీద పడ్డ అనర్హతను గుర్తు చేసుకుంటూ అన్నారు. ద్వేషపూరిత ప్రసంగం కేసులో కోర్టు అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో ఎన్నికల ర్యాలీలో రాంపూర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ అధికారులపై, ప్రధానమంత్రి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఖాన్‌పై కేసు నమోదైంది.

Maharashtra Politics: మహాలో పెరిగిన ముఖ్యమంత్రి అభ్యర్థులు.. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా సీఎం అవుతానంటున్న కేంద్రమంత్రి అథవాలె

రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఫాతిమా జాబీ తరపున ఆజం ఖాన్ ప్రచారం చేశారు. తన వ్యంగ్య ప్రకటనలకు ప్రసిద్ధి చెందిన ఆజం ఖాన్.. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను ఉద్దేశించి “రాజకీయ నపుంసకులు” అని అన్నారు. ఆజం ఖాన్ రాంపూర్ సదర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఖాన్‌కు కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించిన తర్వాత, రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్, అక్టోబర్‌లో ఖాన్‌ను సభ నుండి అనర్హుడిగా ప్రకటించింది.