బాప్ ఏక్ నెంబర్..బేటా దస్ నెంబర్ : జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : April 22, 2019 / 06:07 AM IST
బాప్ ఏక్ నెంబర్..బేటా దస్ నెంబర్ : జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు

సినీ నటి జయప్రద పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ రాజకీయం రంజుగా సాగుతోంది. బీజేపీ అభ్యర్థి జయప్రదపై… SP అభ్యర్థి ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు మర్చిపోకముందే.. ఆయన తనయుడు మరోసారి నోరు పారేసుకున్నారు. నోటిదురుసులో తాను తండ్రికి తక్కువకానని నిరూపించుకున్నారు. 

రాంపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆజంఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజంఖాన్.. జయప్రదపై పరోక్ష విమర్శలు చేశారు. సభకు హాజరైన ప్రజలను చూశాక జోష్ వచ్చిందో.. లేదంటే… తండ్రిలాగే తానుకూడా ఫేమస్ అవ్వాలనుకున్నాడో ఏమోగానీ… ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమకు.. ఆలీ కావాలి, భజరంగ్‌ బలీ కావాలి అన్న అబ్దుల్లా.. అనార్కలీ మాత్రం వద్దని జయప్రదను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Also Read : శ్రీలంక బాంబు పేలుళ్లు : హైదరాబాద్ లో అలర్ట్ : HMWSSB

ఇటీవలే..ఆజంఖాన్ కూడా… జయప్రదను తానే రాంపూర్‌కు తెచ్చానని.. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పారు. అంతేకాదు ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు ప్రజలకు 17 ఏళ్లుపడితే… ఆమె ఖాకీ అండర్‌వేర్ వేసుకుంటుందనే విషయాన్ని తాను 17 రోజుల్లోనే  గుర్తించానని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో ఆయనపై కేసు కూడా నమోదయ్యింది. జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నోటీసులు జారీ చేసింది. 72 గంటలపాటు ప్రచార నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నారు. అయినా వారి తీరు మారడంలేదు. ఆజంఖాన్ తనయుడి తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Also Read : తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు