Nargis Fakhri : వారి పక్కలో పడుకోలేదు, నూడ్‌గా కనిపించలేదు.. అందుకే అవకాశాలు కోల్పోయా

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘మీటూ’ ఉద్యమం తర్వాత చాలామంది మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా వెల్లడిస్తున్నారు. పలు రంగాల్లో పెద్ద మనుషులుగా చెలామణీ అయ్యే ‘మేక వన్నె పులుల’ అసలు బండారం బయటపెడుతున్నారు. ఇక సినీ పరిశ్రమ గురించి చెప్పక్కర్లేదు. చాలామంది నటీమణులు తమకు ఎదురైన వేధింపుల పర్వాన్ని బహిర్గతం చేశారు, చేస్తున్నారు.

Nargis Fakhri : వారి పక్కలో పడుకోలేదు, నూడ్‌గా కనిపించలేదు.. అందుకే అవకాశాలు కోల్పోయా

Nargis Fakhri

Nargis Fakhri : ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘మీటూ’ ఉద్యమం తర్వాత చాలామంది మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా వెల్లడిస్తున్నారు. పలు రంగాల్లో పెద్ద మనుషులుగా చెలామణీ అయ్యే ‘మేక వన్నె పులుల’ అసలు బండారం బయటపెడుతున్నారు. ఇక సినీ పరిశ్రమ గురించి చెప్పక్కర్లేదు. చాలామంది నటీమణులు తమకు ఎదురైన వేధింపుల పర్వాన్ని బహిర్గతం చేశారు, చేస్తున్నారు. కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. తాజాగా మరో బాలీవుడ్ నటి తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తనకు ఎందుకు సినిమాల్లో అవకాశాలు రాలేదో వివరించింది.

నర్గీస్ ఫక్రి… బిటౌన్ లో పాపులర్ యాక్టర్. 2011లో రొమాంటిక్ డ్రామా “రాక్‌స్టార్‌”తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో ఆమె ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది. తర్వాత పొలిటికల్ థ్రిల్లర్ “మద్రాస్ కేఫ్‌”లో కూడా కనిపించింది. కమర్షియల్ హిట్లుగా నిలిచిన కామెడీ ఎంటర్ టైనర్ హిందీ చిత్రాలు “మెయిన్ తేరా హీరో”, “గూఢచారి”, “హౌస్‌ఫుల్‌”లలో నటించింది.

కాగా, కొన్ని పనులు చేయడానికి నిరాకరించడం వల్ల ఇండస్ట్రీలో తను స్ట్రగుల్ అయ్యాయని ఆమె వాపోయింది. ఆ కారణంగానే సినిమాల్లో అవకాశాలను కోల్పోయిందట. బాలీవుడ్‌లో తన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఆమె కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది.

నర్గిస్ తనకంటూ కొన్ని నియమ నిబంధనలు, సరిహద్దులు గీసుకుందట. సినిమా ఇండస్ట్రీలో పేరు కోసం, లేదా అవకాశాలను పొందడం కోసం నేక్డ్ గా కన్పించడం, దర్శక నిర్మాతలకు కమిట్ మెంట్ ఇవ్వడం వంటి పనులు చేయలేదట. అవకాశాలు కావాలంటే తమ పక్కలో పడుకోవాలని, కోరిక తీర్చాలని కొందరు డైరెక్టర్లు అడిగారని నర్గీస్ ఆరోపించింది. అయితే తాను అందుకు ఒప్పుకోలేదని, వారి పక్కలో పడుకునేందుకు నిరాకరించానని చెప్పింది. ఆ
కారణంగానే తను సినిమాల్లో అవకాశాలు కోల్పోయానంది ఈ భామ.

ఫేమ్ కోసం తనకు అత్యాశ లేదంది. అందువల్లే ఏ దర్శకుడి లైంగిక డిమాండ్లకు తలొగ్గలేదని వెల్లడించింది. అంతేకాదు మోడలింగ్ లో కూడా ఇదే దుస్థితి అని వాపోయింది. కొన్నిసార్లు టాప్ లెస్ షాట్ లు చేయమని, యాడ్లలో సూపర్ నేక్డ్ గా కనిపించమని తనను అడిగారట. కానీ తనకు అలా చేయడం ఇష్టం ఉండదని, పైగా అసౌకర్యంగా కూడా అన్పించిందని చెప్పుకొచ్చింది. అవకాశాలు కావాలంటే తమ పక్కలో పడుకోవాలని కొందరు డైరెక్టర్లు కోరారని, అందుకు తాను నిరాకరించానని నర్గీస్ ఫక్రి చేసిన వ్యాఖ్యలు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. చర్చకు దారితీశాయి. నర్గీస్ ఫక్రి చెప్పిన ఆ డైరెక్టర్లు ఎవరబ్బ అని ఆరా తీస్తున్నారు.