Covid BA 5 : కోవిడ్ బీఏ 5 వేరియంట్ తో ముప్పు-భారత్ బయోటెక్ సీఎండీ

బీఏ5 అనే కొత్త రకం కొవిడ్‌ వైరస్‌ సోకిన వారు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఎదురు కావచ్చని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల చెప్పారు.

Covid BA 5 : కోవిడ్ బీఏ 5 వేరియంట్ తో ముప్పు-భారత్ బయోటెక్ సీఎండీ

Covid BA 5 :  బీఏ5 అనే కొత్త రకం కొవిడ్‌ వైరస్‌ సోకిన వారు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఎదురు కావచ్చని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల చెప్పారు. ఈ కొత్త రకం వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు. ఈవిషయంలో తాము ముందుగానే ముమ్మర పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కొవిడ్‌ వ్యాధికి చుక్కల మందు టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌)కు ఈ నెలలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నుంచి అనుమతి లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నాం. అన్నీ అనుకూలిస్తే, ఈ నెలలోనే అనుమతి రావచ్చు అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాలతో పాటు చుక్కల మందు టీకాతో ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ‘కొవిడ్‌’ వ్యాధి మళ్లీ విరుచుకుపడినా, వైరస్‌లో కొత్త రకం పుట్టుకొచ్చినా చుక్కల మందు టీకాతో దాన్ని ఎదుర్కోగలుగుతామని కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు.

Also Read : Income Tax Raids In Hyderabad : హైదరాబాద్‌లో ఐటీ దాడులు