litti – choka seller : మరో “బాబా కా దాబా” : సాయం చేస్తామంటున్న యూజర్లు

ముంబైలో ‘లిట్టి - చోఖా’ (గోధుమ పిండితో వంటకం) అమ్ముతుంటాడు యోగేశ్. ఇతని గురించి ప్రియాంశు ద్వివేదీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

litti – choka seller : మరో “బాబా కా దాబా” : సాయం చేస్తామంటున్న యూజర్లు

Baba Ka Dhaba 2.0

baba ka dhaba : ఢిల్లీలో వృద్ధ దంపతులు నడుపుతున్న హోటల్ వ్యాపారం తీవ్ర నష్టాల్లో కొనసాగుతోందని..వీరిని ఆదుకోవాలని నెట్టింట్లో పెట్టిన ఫొటోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా..నష్టపోయిన ఈ వృద్ధ దంపతులను ఆదుకోవడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. బాబా కా దాబా పేరిట పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. ప్రజలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు ఇవ్వడంతో ఆ వృద్ధుడు ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా..మరొక యువకుడి పోస్టు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

ముంబైలో ‘లిట్టి – చోఖా’ (గోధుమ పిండితో వంటకం) అమ్ముతుంటాడు యోగేశ్. ఇతని గురించి ప్రియాంశు ద్వివేదీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. వ్యాపారాన్ని నడపడానికి చాలా కష్టపడుతున్నాడని తెలిపారు. యోగేశ్ అనే వ్యక్తి ముంబైలోని వర్సోవా బీచ్ సమీపంలో..లిట్టి – చోఖా అమ్ముతున్నాడని, ఇతడు చేసే వంటకాలు చాలా రుచిగా ఉన్నాయన్నాడు. కేవలం రూ. 20 లకే రెండు లిట్టీలు, చోఖా, చట్నీ, బటర్, సలాడ్ అందిస్తున్నాడన్నారు. కానీ..ప్రస్తుతం ఇతని వ్యాపారం సరిగ్గా నడవడం లేదని, ఇతను తయారు చేసే పదార్థాలను జొమాటోలో అమ్ముకోవాలని అనుకుంటున్నాడని..అయితే..ఎలా నమోదు చేసుకోవాలో యోగేశ్ కు తెలియదని వివరించారు. వీలుంటే..యోగేశ్ కు సహాయం చేయాలని యూజర్లను కోరారు. దీనికి ఫుల్ రెస్పాండ్ వస్తోంది. సాయం చేస్తామని యూజర్లు చెబుతున్నారు. అతడి దుకాణాన్ని జొమాటో నమోదు చేయాలని యూజర్లు కోరుతున్నారు.