Baba Ka Dhaba Owner : బాబా కా దాబా ఓనర్ ఆత్మహత్యాయత్నం

గతేడాది కరోన కాలంలో వైరల్ వీడియోతో యావత్ దేశానికి పరిచయమైన ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ ఓన‌ర్ కాంతా ప్ర‌సాద్ (81) ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు.

Baba Ka Dhaba Owner : బాబా కా దాబా ఓనర్ ఆత్మహత్యాయత్నం

Baba Ka Dhaba Owner

Baba Ka Dhaba Owner గతేడాది కరోన కాలంలో వైరల్ వీడియోతో యావత్ దేశానికి పరిచయమైన ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ ఓన‌ర్ కాంతా ప్ర‌సాద్ (81) ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. గురువారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా..ఆయనని వెంట‌నే స‌ఫ్ద‌ర్‌జంగ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. గురువారం రాత్రి ఓ వ్యక్తి ఆత్మహత్యానికి ప్రయత్నించాడని,అతడు హాస్పిటల్ లో చేర్చించబడ్డాడని తమకు ఓ ఫోన్ కాల్ వచ్చింది వెంటనే తాము హాస్పిటల్ కి వెళ్లి చూడగా..ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని కాంతా ప్రసాద్ గా గుర్తించామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం కాంతాప్రసాద్ కి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజులుగా డిప్రెషన్ తో బాధపడుతున్న కాంతాప్రసాద్ గత రాత్రి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడని ఆయన భార్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాంతా ప్ర‌సాద్ నిద్ర‌మాత్ర‌లు మింగిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. ఆ వెంట‌నే అత‌డు స్పృహ కోల్పోయిన‌ట్లు తెలిపారు. దీనిపై పోలీసులు త‌దుప‌రి విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఢిల్లీలోని మాల్వీయ నగర్‌లో రోడ్డు పక్కన బాబా కా దాబా అనే చిన్న స్టాల్‌లో ఆహారాన్ని విక్రయించే కాంతాప్రసాద్ దంపతులు గతేడాది కోవిడ్ లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో 2020 అక్టోబర్ 7న గౌర‌వ్ వాస‌న్ అనే ఓ యూట్యూబ‌ర్ కాంతా ప్రసాద్‌, అత‌ని భార్య నిర్వ‌హిస్తున్న దాబాపై తీసిన వీడియో తీసాడు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ వల్ల చితికిపోయిన ఆ పెద్దాయన తన కష్టాలను ఆ వీడియోలో షేర్ చేసుకున్నారు. వాళ్లు ఎంతో క‌ష్టంగా బతుకీడుస్తున్నార‌ని, ఆదుకోవాల‌ని స‌దరు యూట్యూబ‌ర్ త‌న ఫాలోవ‌ర్ల‌ను కోరాడు. ఆ వెంట‌నే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది. దీంతో బాబా కా దాబా స్టాల్ వద్దకు ఢిల్లీ ప్రజలు క్యూ కట్టారు. ఆ వృద్ధ దంపతులను ఆదుకునే ప్రయత్నం చేశారు. కాంతా ప్ర‌సాద్‌కు స‌పోర్ట్ చేయండంటూ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా కోరారు. దీంతో బాబా కా దాబా మరింత ఫేమ‌స్ అయింది. ఈ సమయంలో దేశం న‌లుమూల‌ల నుంచి త‌న‌కు వ‌చ్చిన విరాళాల విష‌యంలో ఆ యూట్యూబ‌ర్ గౌర‌వ్ వాస‌న్‌, కాంతా ప్ర‌సాద్ మ‌ధ్య వివాదం కూడా చెల‌రేగింది. ఈ క్రమంలో యూట్యూబర్ గౌరవ్ వాసన్ పైన కాంతాప్రసాద్ చీటింగ్ కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే.

ఇక,గతేడాది డిసెంబర్ లో త‌న‌కు వ‌చ్చిన భారీ విరాళాల‌తో కాంతా ప్ర‌సాద్ ఓ రెస్టారెంట్ ప్రారంభించాడు. రూ.5 లక్షల పెట్టుబడితో కాంతా ప్రసాద్ ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. ముగ్గురు పనివాళ్ల సాయంతో రెస్టారెంట్ నడిపేవారు. షాపు అద్దెతోపాటు సిబ్బందికి జీతాలు, కరెంటు, వాటర్ బిల్లులు, కిరాణా తదితర సామాగ్రికి కలిసి నెలకు సుమారు రూ.లక్ష వరకు ఖర్చయ్యేది. అయితే, రెస్టారెంటుకు కనీసం రూ.40 వేలు కూడా ఆదాయం లభించేది కాదు. దీంతో ప్రారంభించిన మూడు నెలల్లోనే ప్రసాద్ రెస్టారెంటును మూసివేయాల్సి వచ్చింది. రెస్టారెంటులోని సామాన్లన్నీ అమ్మేయగా.. కేవలం 30 వేలు మాత్రమే దక్కాయి. వాళ్లు ఈ మ‌ధ్యే తిరిగి త‌మ పాత ప్లేస్‌కు వెళ్లి బాబా కా దాబా ప్రారంభించారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కాంతాప్రసాద్ ఓ వీడియోలో మాట్లాడుతూ..యూట్యూబర్ గౌర‌వ్ వాస‌న్ తమను మోసగించలేదని అన్నారు. గౌరవ్ వాసన్ మంచివాడని..తమకు చాలా సాయం చేశాడని తెలిపారు. తమ పొరపాటుకి క్షమించాలని ఆ వీడియోలో కాంతాప్రసాద్ వేడుకున్నారు.

తనకు ఈ పరిస్థితి రావడానికి కారణం.. సామాజిక కార్యకర్త తుశాంత్ అద్లాఖా అని కాంతా ప్రసాద్ ఆరోపించారు. కొత్త రెస్టారెంట్ ప్రారంభించేందుకు ఆయనే సాయం చేశాడు. రెస్టారెంట్‌ను విజయవంతంగా నడిపే బాధ్యత తనేదనని అన్నాడు. కానీ, దాని గురించి సమయాన్ని కేటాయించలేదని తెలిపారు. అయితే, అద్లాఖా మాత్రం.. ఈ వైఫల్యానికి కారణం అతడి ఇద్దరి కొడుకులేనని తెలిపాడు. ‘వారెప్పుడు కౌంటర్ వద్దే ఉండేవారు కాదు. హోం డెలివరీ కోసం ఎన్నో ఆర్డర్లు వచ్చేవి. కానీ, వాటిని డెలివర్ చేయడంలో విఫలమయ్యారుని తెలిపాడు.