కరోనా పోరాటంలో మా వంతు : పీఎం రిలీఫ్ ఫండ్ కు బాబా రాందేవ్ 25కోట్లు

  • Published By: venkaiahnaidu ,Published On : March 30, 2020 / 12:24 PM IST
కరోనా పోరాటంలో మా వంతు : పీఎం రిలీఫ్ ఫండ్ కు బాబా రాందేవ్ 25కోట్లు

కరోనా వైరస్ పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కు 25కోట్లను డొనేట్ చేస్తున్నట్లు సోమవారం(మార్చి-30,2020)రాందేవ్ బాబా తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కు విరాళాలిస్తున్నారు.

మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌ కు రూ .5 కోట్లు విరాళాన్ని భారత నెం.1 ధనవంతుడు,రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ముఖేష్ భార్య నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా నిరుపేదలకు ఉచిత భోజనం అందిస్తామని హామీ ఇచ్చింది. అదనంగా, COVID-19 తో పోరాడుతున్న రోగుల కోసం తమకు చెందిన మొత్తం ఆసుపత్రిని కూడా విరాళంగా ఇచ్చారు అంబానీ.

టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ శనివారం(28 మార్చి 2020) దేశంలో కోవిడ్ -19 సంక్షోభంపై పోరాటానికి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి భారీ విరాళాన్ని ప్రకటించారు రతన్ టాటా. రూ. 500కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో మొత్తంగా రూ.1,500 కోట్ల మేర నిధులను టాటాలు కరోనా కోసం వినియోగిస్తున్నారు.