Babar Azam: కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన పాక్ క్రికెటర్

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు. వన్డేల్లో కెప్టెన్ గా అతి తక్కువ ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Babar Azam: కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన పాక్ క్రికెటర్

Kohli

Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు. వన్డేల్లో కెప్టెన్ గా అతి తక్కువ ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరుపై ఉంది. విరాట్ కోహ్లీ 17 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధిస్తే.. అజామ్ 13 ఇన్నింగ్స్ ల్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియన్స్ 18 ఇన్నింగ్స్ లో మూడో స్థానంలో, కేన్ విలియమ్సన్ 20 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించారు.

Virat Kohli: ఇన్‌స్టాలో 20 కోట్ల ఫాలోవర్లతో కోహ్లీ రికార్డు.. దేశంలోనే నెంబర్ 1

ముల్తాన్ వేదికగా వెస్టండీస్ తో జరిగిన తొలి వన్డేలో బాబర్ సెంచరీతో చెలరేగాడు. కాగా ఏడాదిలో వన్డేల్లో బాబర్ కు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం గమనార్హం. వన్డే క్రికెట్ చరిత్రలో రెండు సార్లు వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్ మెన్ గా బాబర్ అజాం రికార్డులకెక్కాడు. 2016లో యూఏఈ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి సారిగా బాబర్‌ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు.

Virat Kohli: సీజన్‌లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ

ముల్తాన్ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 306 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఛేధించింది. పాక్ ఇన్నింగ్స్ లో కెప్లెన్ బాబర్ అజం 103 పరుగులతో చెలరేగాడు.