లైవ్ బ్లాగ్ : బాబ్రీ మసీదు తీర్పు

  • Published By: Mahesh ,Published On : September 30, 2020 / 12:01 PM IST
లైవ్ బ్లాగ్ : బాబ్రీ మసీదు తీర్పు

[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,1:38PM” class=”svt-cd-green” ] సత్యమేవ జయతే అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ట్వీట్ చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారాయన. రాజకీయ పక్షపాతంతో బాధ పడుతోందని, తప్పుడు కేసులతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందన్నారు. దీనికి కారణమైన వారు దేశానికి క్షమాపణలు చెప్పాలన్నారు. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,1:34PM” class=”svt-cd-green” ] బీజేపీ సీనియర్ లీడర్ అద్వానిని న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కలిశారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెలువరించిన అనంతరం అద్వానీ నివాసానికి ఆయన వెళ్లారు. కోర్టు ప్రకటించిన 32 మంది నిర్దోషుల్లో అద్వానీ కూడా ఉన్నారు. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,1:32PM” class=”svt-cd-green” ] బాబ్రీ మసీదు కూల్చివేతలో లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును తప్పు బట్టారు AIMPLB secretary Zafaryab Jilani. హైకోర్టులో తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని బాబ్రీ యాక్షన్ కమిటీలో సభ్యుడైన న్యాయవాది వెల్లడించారు. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,1:27PM” class=”svt-cd-green” ] బాబ్రీ మసీదు కేసులో లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తుది తీర్పును స్వాగతిస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 32 మంది నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంత ఆలస్యమైనా..న్యాయం గెలుస్తుందని తెలిపారు. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,1:23PM” class=”svt-cd-green” ] బాబ్రీ మసీదు తుది తీర్పుపై బీజేపీ సీనియర్ లీడర్ అద్వానీ స్పందించారు. స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని వెల్లడించారు. తమ అందరికీ చాలా సంతోషకరమన్నారు. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,1:20PM” class=”svt-cd-green” ] బాబ్రీ మసీదు తుది తీర్పుపై పలువురు స్పందిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మురళీ మనోహర్ జోషి మీడియాతో మాట్లాడారు. సీబీఐ కోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు. ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని, దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. రామ మందిరం నిర్మాణం కోసం తాము ఉద్యమించామని గుర్తు చేశారాయన. ప్రజలను చైతన్యపరచడమే తమ ఉద్దేశ్యమన్నారు. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,1:16PM” class=”svt-cd-green” ] బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువడింది. ఈ నేపథ్యంలో..హైదరాబాద్‌ పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్ట్‌లో అదనపు భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,1:15PM” class=”svt-cd-green” ] బాబ్రీ మసీదు కేసులో లక్నో సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. శాంతిభద్రతలు తలెత్తకుండా..ఏర్పాట్లు చేయాలని సూచించింది. పథకం ప్రకారం బాబ్రీ మసీదు కూల్చివేత జరగలేదని, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరూ నిర్దోషులేనని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు వెల్లడించింది. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,12:45PM” class=”svt-cd-green” ] బాబ్రీమసీదు కూల్చివేత కేసులో కోర్టు రూమ్‌ నంబరు 18లో సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ జడ్జి తీర్పును చదివి వినిపించారు. ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో 2 వేల పేజీల జడ్జిమెంట్‌ కాపీని రూపొందించారు. ముద్దాయిలుగా ఉన్న వినయ్‌ కతియార్, సాక్షిమహారాజ్‌, ధరమ్‌దాస్‌, రామ్‌ విలాస్‌ వేదాంతి, లల్లూ సింగ్, పవన్ పాండ్యా తదితరులు కోర్టుకు చేరుకున్నారు. ఇక మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి, కళ్యాణ్‌‌ సింగ్‌, సతీశ్‌ ప్రధాన్‌, గోపాల్‌ దాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యారు. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,12:40PM” class=”svt-cd-green” ] బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొంతమంది స్వాగతిస్తుంటే..మరొకవర్గం వ్యతిరేకిస్తోంది. 1992 డిసెంబర్ 06వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేతలో బ్లాక్ డేగా ఎలా పరిగణిస్తుంటారో..ప్రస్తుతం ఇలాగే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సరైన ఆధారాలు లేవనే కారణంగా ఈ కేసును కోర్టు తోసిపుచ్చింది. మొత్తం నిందితులందరూ..నిర్దోషులుగా వెల్లడించింది. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,12:32PM” class=”svt-cd-green” ] పథకం ప్రకారం బాబ్రీ మసీదు కూల్చివేత జరగలేదని, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరూ నిర్దోషులేనని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు వెల్లడించింది. ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితో సహా 32 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. ఈ అభియోగాలను కోర్టు కొట్టివేసింది. 32 మంది నిందితులకు విముక్తి లభించిందని న్యాయవాదులు వెల్లడించారు. వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారవైన్నారు. కొతమంది అరాచకశక్తులు రాళ్లు విసిరారని, నిందితులు ప్రయత్నం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,12:25PM” class=”svt-cd-green” ] మసీదు కూల్చివేత కేసును లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. మసీదు కూల్చివేత వెనుక ఎలాంటి కుట్ర లేదని వెల్లడించింది. దీంతో బాబ్రీ మసీదు కేసులో నిందితులందరికీ విముక్తి లభించినట్లైంది. బీజేపీలో కీలక నేతలుగా ఉన్న అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్ కు ఊరట లభించింది. [/svt-event]
[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,12:23PM” class=”svt-cd-green” ] 1992 డిసెంబర్ 06వ తేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కుట్ర కోణంలో సీబీఐ దర్యాప్తు జరిపింది. సీబీఐ ఇచ్చిన ఆధారాలను సీబీఐ ప్రత్యేక కోర్టు పరిశీలించింది. భావోద్వేగాల ప్రకారం జరిగిందని, ప్రణాళిక బద్ధంగా మసీదును కూల్చివేయాలని ప్లాన్ జరగలేదని వెల్లడించింది. కుట్రపూరిత చర్యగా సీబీఐ కోర్టు పరిగణించలేదు. నిందితులకు ఊరట లభించినట్లేనని అంటున్నారు. [/svt-event]

[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,12:19PM” class=”svt-cd-green” ] బాబ్రీ మసీదు కేసులో తుది తీర్పు వెలువరించింది. ఎలాంటి కుట్ర లేదని లక్నో సీబీఐ కోర్టు చెప్పింది. 28 ఏళ్ల నాటి కేసులో కుట్ర పూరితంగా కూల్చినట్లు ఆధారాలు లేవని లక్నో సీబీఐ కోర్టు వెల్లడించింది. [/svt-event]

[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,12:15PM” class=”svt-cd-green” ] హిందూ ముస్లింలు ఇద్దరూ సహోదరుల్లా ఉంటారని, ఇందుకు అయోధ్య అతిపెద్ద ఉదహారణ అన్నారు అయోధ్య డీఐజీ దీపక్ కుమార్. అదనపు భద్రతా ఏర్పాట్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు. [/svt-event]

[svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,12:10PM” class=”svt-cd-green” ] 28 ఏళ్ల నాటి కేసులో లక్నో సీబీఐ కోర్టు తీర్పును వెలువరిస్తోంది. 1992 డిసెంబర్ 06వ తేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. దర్యాప్తు సమయంలో ఇప్పటికే 17 మంది చనిపోయారు. 351 మంది సాక్షులను సీబీఐ విచారించింది. 600 సాక్ష్యాధారాలను కోర్టు ముందు సీబీఐ ఉంచింది. [/svt-event]

[svt-event title=”బాబ్రీ మసీదు తీర్పు” date=”30/09/2020,12:05PM” class=”svt-cd-green” ] అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్ తో ఆరుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. 1992 డిసెంబర్ 06వ తేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. [/svt-event]

[svt-event title=”బాబ్రీ మసీదు కూల్చివేత..తీర్పు కాపీ చదువుతున్న వెలువరిస్తున్న జడ్జీ” date=”30/09/2020,12:00PM” class=”svt-cd-green” ] బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు తీర్పును వెలువరిస్తోంది. 2 వేల పేజీలతో తుది తీర్పు ఉంది. జడ్జీ ఎస్.కె.యాదవ్ తీర్పు కాపీలను చదువుతున్నారు. మొత్తం 32 మందిలో 26 మంది కోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు ఎల్ కే అద్వానీ. కోర్టు తీర్పుపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. [/svt-event]

[svt-event title=”Babri Masjid Demolition Verdict తీర్పుపై ఉత్కంఠ..” date=”30/09/2020,11:55AM” class=”svt-cd-green” ] బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. తీర్పు లా అండ్ ఆర్డర్‌ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లోని సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతలపై సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.. [/svt-event]