‘అమ్మా వచ్చేయమ్మా’…నర్సును చూసి బిడ్డ కన్నీరు..చలించిన కర్నాటక సీఎం

ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ.. తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి... తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది. 

  • Published By: veegamteam ,Published On : April 9, 2020 / 06:21 PM IST
‘అమ్మా వచ్చేయమ్మా’…నర్సును చూసి బిడ్డ కన్నీరు..చలించిన కర్నాటక సీఎం

ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ.. తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి… తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది. 

కరోనా మహమ్మారిపై డాక్టర్లు, నర్సులు ముందుండి పోరు చేస్తున్నారు. కరోనా బాధితులకు వారు చేస్తున్న సేవలు అమోఘం, అనిర్వచనీయం. ఆమె వృత్తి రీత్యా నర్సు. రోజూ వందల మందికి ఆమె సేవలు అవసరం. ఆస్పత్రిలో నర్సు లేకపోతే నడవదు. అలాంటి నర్సుకు ఇల్లు కూడా ముఖ్యమే. కానీ కరోనా వైరస్ రోగులకు సేవలు అందించడంలో ఆమె నిమగ్నమైంది. మృత్యువుతో పోరాడుతున్న కరోనా బాధితులను బతికించేందుకు అహర్నిశలు కష్టపడుతోంది. ఆమె తన పూర్తి సమయాన్ని ఆస్పత్రికే కేటాయిస్తోంది. ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మ కావాలంటూ మారాం చేసింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి… తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది. 

సుగంధ అనే మహిళ బెళగావి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ఈ వార్డుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. సుగంధకు ఐసోలేషన్ వార్డుల్లో డ్యూటీ వేశారు. రోగులకు నర్సు సేవలు చేస్తోంది. 15 రోజుల నుంచి ఆమె ఇంటికి వెళ్లలేదు. తల్లి ఇంటికి వెళ్లకపోయే సరికి బిడ్డకు ఆమెను చూడాలనిపించింది. దీంతో నిన్న తండ్రి బైక్ పై బిడ్డను ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లాడు. బైక్ మీద కూర్చోబెట్టకుని తల్లిని చూపించారు. 

నర్సు అయిన తల్లిని చూసి బిడ్డ బోరున విలిపిచింది. అమ్మా ప్లీజ్ కమ్ బ్యాక్ అంటూ చూసి గుక్కపట్టి ఏడ్చింది. బిడ్డ ఏడుపును చూసి తల్లి కూడా కన్నీరుమున్నీరైంది. ఒకరికొకరు దూరంగానే ఉండి ఏడుస్తున్నారు. కానీ బిడ్డను ఓదార్చేందుకు తల్లి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. దూరం నుంచే హాయ్ చెప్తూ తీసుకెళ్లిపోండి అంటూ కన్నీరుపెట్టుకుంది. ఆ చిన్నారి అమ్మను రమ్మని పిలవడం, గుండెలవిసేలా రోదించడం అందరినీ కలిచివేసింది. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఈ విషయం తెలుసుకున్న కర్నాటక సీఎం యెడియూరప్ప తల్లీబిడ్డల కన్నీరుపై స్పందించారు. ఆ వీడియోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. తల్లీబిడ్డల రోదనపై ట్వీట్ చేశారు. ఆ నర్సుకు సీఎం యెడియూరప్ప ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఆమె అంకితభావాన్ని ప్రశంసించారు. త్వరలోనే పరిస్థితులు మెరుగవుతాయని అన్నారు.

‘మీరు మీ బిడ్డను వదిలిపెట్టి చిత్తశుద్ధితో విధులకు హాజరవుతున్నారు. అనేక సమస్యల నడుమ మీరు కష్టపడి పని చేస్తున్నారు. మీ బిడ్డ ఏడుపును టీవీలో చూశాను. మీకు భవిష్యత్ లో మంచి అవకాశాలు లభిస్తాయి. మిమ్మల్ని తప్పకుండా గుర్తు పెట్టుకుంటాను. మిమ్మల్ని ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కృషికి ఫలితం ఉంటుంది’ అని సీఎం నర్సుతో ఫోన్ లో మాట్లాడారు.(కోలుకున్న రోగులకు మళ్లీ కరోనా)