Badrinath Dham open : తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం .. 15 క్వింటాళ్ల బంతిపూలతో అలంకరణ చూసి పరవశించిపోయిన భక్తులు

ఛార్‌ధామ్ యాత్ర‌లో భాగ‌మైన బద్రీనాథ్ ఆల‌యంలో ఈరోజునుంచి భక్తులకు దర్శ‌నాలు ప్రారంభమయ్యాయి. ఉద‌యం 7.10 నిమిషాల‌కు ఆల‌యం తెరుచుకోవటంతో అప్పటికే స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులు బద్రీనాథుడ్ని దర్శించుకున్నారు. బంతిపూలతో అలంకరించిన బద్రీనాథ్ ఆలయాన్ని చూసిన భక్తులు పరవశించిపోతున్నారు.

Badrinath Dham open : చార్ దామ్ యాత్ర ఒకటైన బద్రీనాథుడి ఆలయం తెరుచుకుంది. ఇప్పటికే ఈ యాత్రలో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం ఏప్రిల్ 25న తెరుచుకుంది. భక్తులు దర్శించుకుంటున్నారు. ఈక్రమంలో ఈరోజు ఉదయం 7.10 గంటలకు బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. బంతిపూలతో అలంకరించిన బద్రీనాథుడి ఆలయాన్ని చూసిన భక్తులు పరవశించిపోతున్నారు.

ఉత్త‌రాఖండ్‌లోని బద్రీనాథ్ ఆల‌యాన్ని గురువారం (ఏప్రిల్ 27,2023)ఉద‌యం తెరిచారు. ఛార్‌ధామ్ యాత్ర‌లో భాగ‌మైన బద్రీనాథ్ ఆల‌యంలో ఈరోజునుంచి భక్తులకు దర్శ‌నాలు ప్రారంభమయ్యాయి. ఉద‌యం 7.10 నిమిషాల‌కు ఆల‌యం తెరుచుకోవటంతో అప్పటికే స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులు బద్రీనాథుడ్ని దర్శించుకున్నారు. బంతిపూలతో అలంకరించిన బద్రీనాథ్ ఆలయాన్ని చూసిన భక్తులు పరవశించిపోతున్నారు. భక్తితో మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఛార్‌ధామ్ లో భాగ‌మైన బద్రీనాథ్ క్షేత్రాన్ని ప్రతీ ఏటా వేల సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకుంటుంటారు. ముఖ్యంగా ఆలయం తెరవగానే స్వామిని దర్శించుకోవటానికి భక్తులు వేచి ఉంటారు. ఆలయదర్శనం సందర్భంగా ఆల‌యాన్ని సుమారు 15 క్వింటాళ్ల పువ్వుల‌తో అలంక‌రించారు. ఆర్మీ బ్యాండ్, జై బ‌ద్రీ అంటూ భక్తుల చేస్తున్న జ‌య‌జ‌య‌ధ్వానాల మ‌ధ్య ఆల‌యాన్ని తెరిచారు నిర్వాహకులు.

ట్రెండింగ్ వార్తలు