CharDham Yatra 2023: భయానక వీడియో.. రహదారిపై భారీగా విరిగిపడిన కొండచరియలు.. పరుగులు తీసిన యాత్రికులు..

వాతావరణం అనుకూలించక, రహదారిపై అడ్డంగా కొండచరియలు విరిగి పడుతుండటంతో యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. సహాయక సిబ్బంది రహదారిపై కూలిపోయిన కొండచరియలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.

CharDham Yatra 2023: భయానక వీడియో.. రహదారిపై భారీగా విరిగిపడిన కొండచరియలు.. పరుగులు తీసిన యాత్రికులు..

CharDham Yatra 2023

CharDham Yatra 2023: బద్రీనాథ్ యాత్రికులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. రహదారిపై కొండచరియలు విరిగి పడుతుండటంతో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బద్రీనాథ్ హైవేపై హెలాంగ్‌లో కొండపై నుంచి శిథిలాలు భారీగా పండటంతో రహదారి మూసుకుపోయింది. దీంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బద్రీనాథ్‌కు వెళ్లే యాత్రికులు వారివారి ప్రాంతాల్లో వేచి ఉండాలని సూచించిన పోలీసులు..  గౌచర్, కర్ణ ప్రయాగ్, లంగాసు ప్రాంతాల్లో రహదారిపై వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

Badrinath Dham open : తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం .. 15 క్వింటాళ్ల బంతిపూలతో అలంకరణ చూసి పరవశించిపోయిన భక్తులు

బద్రీనాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడుతున్న భయానక వీడియో వైరల్‌గా మారింది. బద్రీనాథ్ జాతీయ రహదారిపై హెలాంగ్ వద్దకు వాహనాల ద్వారా యాత్రికులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. అప్పటికే వాహనాలను నిలిపివేయగా.. ఈ ఘటనతో వాహనాల్లోని యాత్రికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

 

ఇదిలాఉంటే.. వాతావరణం అనుకూలించక, రహదారిపై అడ్డంగా కొండచరియలు విరిగి పడుతుండటంతో యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. సహాయక సిబ్బంది రహదారిపై కూలిపోయిన కొండచరియలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. హెలాంగ్‌లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై మట్టిదిబ్బలను తొలగించిన తరువాత యాత్రికులను యాత్రకు అనుమతిస్తామని, అప్పటి వరకు సురక్షిత ప్రాంతాల్లో వేచి ఉండాలని కర్ణ ప్రయాగ్ సీఓ అమిత్ కుమార్ తెలిపారు.