Byju Raveendran: ఆమె ఎక్కువగా ప్రశ్నించేది.. తన స్టూడెంట్‌తో ప్రేమ ఎలా ప్రారంభమైందో చెప్పిన బైజు సీఈఓ రవీంద్రన్

ఎడ్యుటెక్ స్టార్ట్ అప్ బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్ ఇటీవల ఓ కార్యక్రమంలో తన సతీమణి దివ్వ గోకుల్‌నాథ్‌తో కలిసి పాల్గొన్నాడు. ఈ క్రమంలో తన స్టూడెంట్‌తో ఏ విధంగా ప్రేమలో పడాల్సి వచ్చిందో, అందుకు ప్రధాన కారణం ఏమిటో రవీంద్రన్ వివరించారు.

Byju Raveendran: ఆమె ఎక్కువగా ప్రశ్నించేది..  తన స్టూడెంట్‌తో ప్రేమ ఎలా ప్రారంభమైందో చెప్పిన బైజు సీఈఓ రవీంద్రన్

Byju Ceo Byju Raveendran

Byju Raveendran: తన ప్రేమ వివాహంపై బైజు సీఈఓ రవీంద్రన్  (Byju Ceo Byju Raveendran) ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను విద్యార్థితో ప్రేమ (Love) లో పడటానికి ఒక కారణం ఉందంటూ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2023లో బైజు రవీంద్రన్, అతని సతీమణి దివ్య గోకుల్‌నాథ్ (Divya Gokulnath) పాల్గొన్నారు. ఈసందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మీరు విద్యార్థినితో ఎలా ప్రేమలో పడ్డారు అంటూ ఎదురైన ప్రశ్నకు బైజు సీఈఓ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. బైజూ విద్యార్థుల్లో దివ్య గోకుల్‌నాథ్ ఒకరని చెప్పారు. ఆ సమయంలో ఆమె నన్ను ఎక్కువగా ప్రశ్నలు వేసేదని, దాని వల్ల నా దృష్టి ఆమెవైపు మళ్లిందని అన్నారు.

BYJU’S Ravindran : బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు

నేను ఎప్పుడూ ఆడిటోరియంలు, అతంకంటే పెద్ద మైదానాల్లో పాఠాలు చెప్పేవాడినని, ఆ క్రమంలో ప్రత్యేకంగా ఒకరిద్దరు విద్యార్థులను గమనించడం సాధ్యం కాదని అన్నారు. అయితే, ఆ సమయంలో విద్యార్థిగా ఉన్న తన సతీమణి దివ్య గోకుల్‌నాథ్ పదేపదే తనను ప్రశ్నలు అడిగేదని, దీంతో ఆమెపై నా దృష్టి మళ్లేదని తన లవ్ స్టోరీని ఆసక్తికరంగా వివరించారు. అయితే, అది ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియదు.. మేమిద్దరం భాగస్వాములం అయ్యామని రవీంద్రన్ తెలిపారు. అయితే, 2011లో ప్రారంభించిన ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌కు తన వ్యవస్థాపక భాగస్వాములుకూడా తన విద్యార్థులేనని రవీంద్రన్ చెప్పారు.

Byju AD : షారుక్ ఖాన్ కు కష్టాలు తప్పవా ? ఆ యాడ్ నుంచి తొలగిస్తారా ?

రవీంద్రన్ సతీమణి దివ్య గోకుల్ నాథ్ మాట్లాడుతూ. వ్యతిరేకతలు, ఆకర్షించాలనే ఆలోచన తమకు వర్తించదని, మొదట ఏం జరిగిందో తెలియదు.. అది మా మధ్య చాలాబాగా పనిచేసింది. దీంతో మేం ఒక్కటయ్యాం. అయితే, మాకు తెలిసిన వారు మేమిద్దరం భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా చెబుతుంటారు. కానీ, లోపల మా ఆలోచనలు సరిగ్గా ఒకే విధంగా ఉంటాయి. దీంతో పని పూర్తయిన తరువాత మా పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతగా ఉంటుందని అన్నారు. 2009లో రవీంద్రన్, దివ్య గోకుల్‌నాథ్‌కు వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.