CAAపై నాటకం…దేశద్రోహం కేసులో పేరెంట్,టీచర్ కు బెయిల్

  • Published By: venkaiahnaidu ,Published On : February 14, 2020 / 02:51 PM IST
CAAపై నాటకం…దేశద్రోహం కేసులో పేరెంట్,టీచర్ కు బెయిల్

పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని విమర్శిస్తూ స్కూల్ ఆవరణలో గత నెల21న బీదర్‌లోని షాహీన్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిల్లలతో ఓ నాటక ప్రదర్శన చేయించారంటూ స్కూల్ యాజమాన్యం, స్కూల్ హెడ్ టీచర్,ఓ విద్యార్థి తల్లిపై జనవరి-30,2020న కర్ణాటక పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

పిల్లలు సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని దూషిస్తూ మాట్లాడాడని ఆరోపిస్తూ ఓ హిందూ కార్యకర్త ఇచ్చిన కంప్లెయింట్ మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అయితే ఈ కేసులో శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)సదరు హెడ్ టీచర్ ఫరీదా బేగమ్,విద్యార్థి తల్లి నజ్ బునిస్సా మిన్సాకి బెయిల్ లభించింది. వీరి అరెస్ట్ ను ఖండిస్తూ కొన్ని రోజులగా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఇవాళ వీరికి బెయిల్ లభించింది.

అయితే ఆ ప్రదర్శనలో ప్రధానమంత్రి మోడీని అవమానపర్చే వ్యాఖ్యలు ఏమీ చేయలేదని,సీఏఏ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీలపై దేశంలోని ముస్లింల గురించి ముస్లింల ఆందోళనల గురించి విద్యార్థులను సున్నితం చేయడానికి చేసిన ఓ ఎక్సర్ సైజ్ మాత్రమే అది అని స్కూల్ యాజమాన్యం చేబుతోంది.

కేవలం ఓ హిందూ కార్యకర్త ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా పోలీసులు ఈ చర్య చేపట్టారని అంటున్నారు.  9 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలను పోలీసులు ఇంటరాగేషన్ పేరుతో కొన్ని రోజులు రోజూ నాలుగైదు గంటలపాటు పదేపదే ప్రశ్నించి మానసిక హింసకు గురి చేశారని స్కూల్ యాజమాన్యం చెబుతోంది.