Bajaj Chetak మళ్లీ వచ్చింది: మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ బైక్

Bajaj Chetak మళ్లీ వచ్చింది: మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ బైక్

బజాబ్ ఆటో ఇండస్ట్రీ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించింది. రెండు దశాబ్దాలుగా వినియోగదారులకు దూరంగా ఉన్న చేతక్ బండిని మరోసారి మార్కెట్లోకి తీసుకురానున్నారు. అయితే దీనికి అర్బనైట్ అని పేరు పెట్టినప్పటికీ చేతక్ అనే వాహనానికి ఉన్న క్రేజ్ కారణంగా అదేపేరు బాగుంటుందని భావిస్తోంది యాజమాన్యం. 

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఒకినావా స్కూటర్స్, హీరో ఎలక్ట్రిక్, ఎథేర్ ఎనర్జీ, ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ట్వంటీ టూ మోటార్స్ వంటి కంపెనీల ఉత్పత్తులకు ధీటుగా ఈ బైక్ ఉండనుంది. మధ్య తరగతి వారికి బాగా దగ్గరైన మోడల్ బండి వస్తుండటంతో పాటు బజాజ్ కంపెనీ నుంచి వస్తోన్న తొలి ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఈ ప్రొడక్ట్ లాంచ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ,  నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌లు హాజరయ్యారు. దీన్ని చేతక్ చిక్ ఎలక్ట్రిక్ అనే పేరుతోనూ పిలవాలని అనుకుంటున్నారు. ఇంకా ఎలక్ట్రిక్ టుమారే పేరిట బజాజ్ మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది.