భయపెడుతున్న‘వెదురు పూలు’ : ఆందోళనలో గ్రామస్థులు 

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా పరిసర ప్రాంతాలల్లోని అటవీప్రాంతమంతటా ‘వెదురు పూత’ వెల్లి విరిసింది. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం..మరోవైపు ప్రమాదాలకు సంకేతమని భావిస్తు ఆందోళన పడుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సంభవిస్తుందని ఆ గ్రమంలోని వృద్ధులు చెబుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : May 14, 2019 / 04:24 AM IST
భయపెడుతున్న‘వెదురు పూలు’ : ఆందోళనలో గ్రామస్థులు 

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా పరిసర ప్రాంతాలల్లోని అటవీప్రాంతమంతటా ‘వెదురు పూత’ వెల్లి విరిసింది. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం..మరోవైపు ప్రమాదాలకు సంకేతమని భావిస్తు ఆందోళన పడుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సంభవిస్తుందని ఆ గ్రమంలోని వృద్ధులు చెబుతున్నారు.

వెదులు లేదా గడలు. మనిషికి చాలా అవసరమైన మొక్కలు (పొదలు).  సాధారణంగా వెదురు పూత 40-45 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తుంది. అత్యంత అరుదుగా కనిపించే ఈ దృశ్యాలు చూడాలంటే నాలుగు దశాబ్దాల పాటు ఎదురు చూడాల్సిందే.అత్యంత అరుదుగా దర్శనమిచ్చే ఈ వెదురు పూతను చూసి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు కొన్ని గ్రామాల వాసులు.   నాలుగు దశాబ్దాల తరువాత పూసిన వెదురు పూతను చూసిన గ్రామస్థులకు ఒక పక్క ఆనందం..మరోపక్క ఆందోళన పడుతున్నారు. 
 

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా పరిసర ప్రాంతాలల్లోని అటవీప్రాంతమంతటా వెదురు పూత వెల్లి విరిసింది. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం..మరోవైపు ప్రమాదాలకు సంకేతమని భావిస్తు ఆందోళన పడుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సంభవిస్తుందని ఆ గ్రమంలోని వృద్ధులు చెబుతున్నారు. 

వెదురు పూతను ఎన్నో రకాలుగా వినియోగించుకుంటారు బస్తర్ గ్రామస్థులు. ఈ పూలను శ్రద్ధగా ఏరి..ఆహారంలో ఉపయోగిస్తారు. పూలను పౌడర్‌గా చేసి..రొట్టెలు తయారు చేసుకుని తింటారు. ఈ పూలతో తయారుచేసిన రొట్టెల్లో చాలా  పౌష్టిక తత్వాలు ఉన్నాయని చెబుతుతారు. సాధారణంగా వెదురు చెట్లు 40-45 ఏళ్లకు పూలు పూస్తుంటాయి. 

ఈ పూల గురించి మహా‌సముంద్ జిల్లాకు చెందిన హృదయ్‌లాల్ ఖాఖ్రే అనే 66 ఏళ్ల వృద్ధుడు మాట్లాడుతు..1979లో ఇలాగే వెదురు విరగపూశాయనీ..అప్పుడు కరువు కాటకాలు సంభవించాయని తెలిపారు. సరాయ్‌పాలీ ప్రాంతానికి చెందిన పురుషోత్తమ్ అనే వృద్ధుడు కూడా వెదురుపూలు ఇలా ఎక్కువగా పూయటం తన జీవితంలో మూడవసారి చూశానని..ఆ సమయాలలో ఎన్నో అశుభాలు జరిగాయని తెలిపాడు. తమ తాత ముత్తాలు కూడా ఇదే విషయాన్ని తెలిపేవారని ఇప్పుడు ఈ వెదురు ఇంతగా విరగపూయటం ఏ విపత్తుకు సంకేతాలలోనని వాపోయాడు. 
కాగా శాస్త్రవేత్తలు మాత్రం వెదురుపూల గురించి మాట్లాడుతూ వెదురు పూలు 40 నుంచి 45 లేదా ఏళ్లకు ఒకసారి పూస్తాయని..అలా పూసిన తరువాత వెదురు ఎండిపోతుందని తెలిపారు. ఇది సర్వసాధారణమే కానీ దీని గురించి ఆందోళన  చెందాల్సిన అవసరం లేదనికొట్టి పారేశారు. లేని భయాలు వద్దని చెబుతున్నారు. చెట్టు ఆయా సమయాలలో పూయటం సర్వసాధారమేనని భయపడాల్సిన పనిలేదని అంటున్నారు.