Banana Cultivation : అరటి సాగు.. అనువైన రకాలు..

అరటిలో కూడా వివిధరకాలు సాగులో ఉన్నవి. వాటిలో కొన్ని కూరకు, మరికొన్ని పండుగానూ ఉపయోగించుచున్నాము. సాగులో ఉన్న అరటి రకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నాయి.

Banana Cultivation : అరటి సాగు.. అనువైన రకాలు..

Banana (1)

ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో అరటి దాదాపు 65 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాలోను అరటి సాగులో ఉన్నప్పటికీ ఖమ్మం, నిజమాబాద్‌, అదిలాబాద్‌, మెదక్‌, వరంగల్‌ జిల్లాలో అధికంగా పండిస్తున్నారు. అరటి ఉష్ణమండలపు వంట, సరాసరి 25-30″ సెల్సియస్‌ ఉష్ణోగ్రత మిక్కిలి అనుకూలము. శీతాకాలంలో ఉష్పోగ్రత 15″ సెల్చియన్‌ కన్నా తక్కువ ఉండకూడదు. సారవంతమైన, తగినంత నీటివసతి కలిగి, నీరు ఇంకిపోయే గుణముతో పాటు తగినంత సేంద్రియ పదార్థము గల నేలలు అనుకూలము. సారవంతమైన ఒండ్రునేలలు శ్రేష్టం. నేల 1.0 నుండి 1.5 మీ. లోతు ఉండి, ఉదజని సూచిక 6 నుండి 75 వరకు ఉండటం మంచిది. పూర్తిగా ఇసుక మరియు చౌడు భూములు తప్పించి మురుగు నీటి వసతి కలిగిన అన్ని ఇతర భూములలోనూ అరటి సాగు చేసుకోవచ్చు. అయితే లోతు తక్కువగా ఉండే భూములలో అరటి సాగుకు ఖర్చు ఎక్కువవుతుంది.

వేసవిలో భూమిని 30-40 సెం.మీ లోతుగా దున్నాలి. దీని వలన భూమి ద్వారా వ్యాపించే చీడపీడలను, కలుపును అరికట్టవచ్చు. తొలకరి వర్షాలకు గొర్రుతో 3-4 సార్లు మెత్తగా దున్నాలి. ఎంపిక చేసిన రకానికి అవనరమైన దూరంలో 5345345 సెంమీ పొడవు, వెడల్పు, లోతు కలిగిన గుంటలు తీయాలి. అన్ని వంటల వలె అరటిలో కూడా వివిధరకాలు సాగులో ఉన్నవి. వాటిలో కొన్ని కూరకు, మరికొన్ని పండుగానూ ఉపయోగించుచున్నాము. సాగులో ఉన్న అరటి రకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నాయి.

అరటిలో సాగుకు అనువైన రకాలు…

కర్పూర చక్కెరకేలి: దేశవాలిగా సాగుచేయబడే రకాలలో ముఖ్యమైనది. సుమారు 2.5-3 మీ. ఎత్తువరకు పెరుగుతుంది. గాలులకు పడిపోయే లక్షణం ఎక్కువగా ఉంది. అందువలన తప్పనిసరిగా వెదురుతో ఊతం ఇవ్వాలి. కాలపరిమితి 12-13 నెలలు కలిగి, సగటున 16-18 కిలోల ఐరువుగల గెలలతో హెక్టారుకు సరాసరి 30 టన్నుల దిగుబడినిస్తుంది. నీటి ఎద్దడి తట్టుకుంటుంది. పనామా తెగులు, ఆకుమచ్చతెగుళ్ళని నిరోధించే లక్షణం ఉన్నది.

తెల్ల చెక్యరకేళి: ఈ రకం ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎక్కువగా సాగులో ఉంది. సూమారు 2.5 మీ. ఎత్తుపెరిగి గాలులకు పడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఊతం ఇవ్వాలి. దీని కాలపరిమితి 11-12 మానములు. నగటున 6-8 కేజీల ఐరువన్న గెలలతో 5-6 హస్తాలు కలిగి ఉంటాయి. ఇంచుమించు గెలకు 70-80 పండ్లు ఉంటాయి. పండ్లు లావుగా ఉండి చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. సగటున హెక్టారుకు 15 టన్నుల దిగుబడినిస్తుంది. దుంపకుళ్ళు తెగులుకు గురవుతుంది.

గ్రాండ్‌ నైన్‌ ; ఇది పెద్ద వచ్చఅరటి కంటే అధిక దిగుబడినిస్తూ ఇటీవల కాలంలో ఎక్కువ సాగులో ఉన్నరకము. ఇది పెద్ద వచ్చ అరటి కంటే ఎత్తు తక్కువగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకము. వంట కాలము 11నెలలు. సగటున గెల బరువు 28 నుండి 30 కిలోలు ఉంటుంది. 9నుండి 10 హస్తాలు కలిగి ఉంటుంది. హెక్టారుకు 65 నుండి 75 టన్నుల దిగుబడినిస్తుంది. పనామా తెగులును తట్టుకుంటుంది.

పొట్టిపచ్చ అరటి: పొట్టివచ్చ అరటినే వామనకేళి మరియు బస్రాయి అని కూడా అంటారు. ఇది 15 మీ ఎత్తు వెరిగి పొట్టిగా ఉండటం వలన ఎకరానికి ఎక్కువ మొక్కలు నాటి ఎక్కువ ఫలసాయం పొందడానికి అవకాశం. ఉంది. గాలులకు బాగా తట్టుకుంటుంది. కానీ నీటి ఎద్దడి తట్టుకోలేదు. దీని కాలపరిమితి 11నెలలు. గెలలు సగటున 13-15 కిలోల బరువుండి 8-10 హస్తాలతో హెళ్టారుకు సగటున 45-50 టన్నుల దిగుబడినిస్తుంది. వేనవి గాలులు, తుఫానులు ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతాలకు అనుకూలమైన రకం. పనామా తెగులును తట్టుకుంటుంది. కానీ ఆకుమచ్చ మరియు బంచీటాప్‌ తెగుళ్ళను తట్టుకొనలేదు. కార్మి తోటలకు అనుకూలం కాదు.

మార్దమాన్‌: మార్టమాన్‌ అరటినే బెంగాల్‌ అమృతపాణి అని కూడా పిలుస్తారు. ఈ రకం కూడ వ్యాపార సరళిలో పండించదానకి చాలా అనువైనది. ఇది పనామా తెగులును చాలా వరకు తట్టుకుంటుంది. దుంవేకు తెగులుకు లొంగిపోతుంది. సూమారు 2.5 నుండి 3.0 మీ॥ ఎత్తు పెరుగుతుంది. గెలలు 18-20 కిలోలుండి, సగటున హెక్టారుకు 45 టన్నుల దిగుబడినిస్తుంది.

కూర రకములు:

కొవ్వూరు బొంత: కూర రకములలో కొవ్వూరు బొంత ముఖ్యమైనది. సగటున 18-20 కేజీల బరువు ఉండి 5-7 హస్తాలతో 70-80 కాయలు కలిగి ఉంటాయి. కాయలు పెద్దవిగా లేత ఆకుపచ్చ రంగు కలిగి ఆకర్షణీయంగా ఉండటం వల్ల ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంది. కాలవరిమతి 12-13 మాసములు. ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. బహువార్షికంగా పండించవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దుంవ కుళ్ళు తెగులుకు లొంగిపోతుంది.

కెబియన్‌-6: కొవ్వూరు బొంత కంటే అధిక దిగుబడినిచ్చే రకం. గెలలు సగటున 20-25 కేజీల బరువుతో 8-9 హస్తాలతో 100-200 కాయలు ఉంటాయి. కాయలు మంచి నాణ్యత కలిగి మంచి ధర వచ్చే అవకాశం. ఉంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. కానీ దుంపకుళ్ళు తెగులుకు లొంగిపోతుంది.

నాటే సమయం: తెల్ల చక్మెర కేళి, కర్పూర చక్కేరకేలి, బొంత రకాలను సంవత్సరం పొడవునా నాటవచ్చు. అయితే ఏప్రిల్‌, ఆగప్టునెలల మధ్య కాలంలో నాటటం మంచిది. పొట్టిచ్చ అరటి, పెద్దవచ్చ అరటి రకాలను తొలకరి వర్షాలు వడిన తర్వాత జూన్‌ నెలనుండి సెప్టెంబరు 15 వరకు మరియు ఫిబ్రవరి, మార్చి నెలల్లో నాటుకోవచ్చు.