Bandaru Dattatreya : హర్యానా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయ

తెలుగు బీజేపీ నేత బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గురువారం హర్యానా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.

Bandaru Dattatreya : హర్యానా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయ

Bandaru Dattatreya Taken Charge As Haryana Governor

Bandaru dattatreya Taken Charge as Haryana Governor : తెలుగు బీజేపీ నేత బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గురువారం (జుల 15,2021)హర్యానా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న దత్తాత్రేయను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ హర్యానాకు బదిలీ చేశారు. ఎనిమిది రాష్ట్రాలకు గవర్నర్లను ప్రకటించిన రాష్ట్రపతి దత్తాత్రేయను హర్యానాకు గవర్నర్ గా నియమించారు. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా బండారు దత్తాత్రేయతో గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, దత్తాత్రేయ భార్య వసంత, కుమార్తె విజయలక్ష్మి ఇతర కుటుంబ సభ్యులతోపాటు తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, జితేందర్‌రెడ్డి, వివేక్, రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులైన విషయం తెలిసిందే. కొంతమందికి స్థానం చలనం కల్పించగా దత్తాత్రేయ హిమాచర్ ప్రదేశ్ నుంచి హర్యానాకు నియమకం అయ్యారు. కాగా ఏపీకి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కంభంపాటి హరిబాబుకు కొత్త గవర్నర్ల జాబితాలో చోటు దక్కిన విషయం తెలిసిందే. మిజోరం రాష్ట్రానికి కంభంపాటి హరిబాబును గవర్నర్ గా నియమించారు. అలాగే కర్ణాటకకు తావర్‌చంద్ గెహ్లాట్,మధ్యప్రదేశ్ కు మంగూభాయ్ ఛగన్‌భాయ్ పటేల్, హిమాచల్ ప్రదేశ్‌కు
రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఆయా స్థానాల్లో ప్రస్తుతం ఉన్న గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు.