Karnataka : సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన బెంగళూరు.. అదేంటో తెలుసా?

దేశంలో అత్యధిక భాషలు మాట్లాడే జిల్లాగా బెంగళూరు రికార్డు సృష్టించింది. ఈ జిల్లాలో అత్యధికంగా 107 భాషలు మాట్లాడుతున్నారు.

Karnataka : సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన బెంగళూరు.. అదేంటో తెలుసా?

Karnataka

Karnataka : అత్యధిక భాషలు మాట్లాడే జిల్లాగా బెంగళూరు ప్రత్యేక స్థానం సంపాదించింది. బెంగుళూరు జిల్లాలో 107 భాషలు మాట్లాడుతున్నారు. దేశంలో మరే జిల్లాలో ఇంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడేవారు లేరు. ఇక వందకు పైగా భాషలు మాట్లాడే జిల్లాల్లో నాగాలాండ్‌లోని దిమాపూర్‌, అసోంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలు ఉన్నాయి. దిమాపూర్ లో 103 భాషలు మాట్లాడుతుండగా, సోనిత్‌పూర్‌ లో 101 భాషలు మాట్లాడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 640 జిల్లాలు ఉండగా.. వీటిలో మూడు జిల్లాలో 100కు పైగా భాషలు మాట్లాడుతున్నారు.

ఇక బెంగళూరు జిల్లాలో 44.5 శాతం మంది కన్నడ, 15 శాతం తమిళం, 14 శాతం తెలుగు, 12 శాతం ఉర్దూ, 6 శాతం హిందీ, 3 శాతం మంది మలయాళం మాట్లాడే వారున్నారు. సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా భాసిల్లుతున్న బెంగళూరు నగరం ఏంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన బ్రతుకుదెరువు నిమిత్తం ఇక్కడకు వస్తుంటారు. ఇక భాషల వివరాలను 2011 సెన్సస్ డాటా ఆధారంగా వెల్లడించారు.

2011 సెన్సస్ డాటా విశ్లేషణను బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ నాన్-రెసిడెంట్ సీనియర్ ఫెలో షమిక రవి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌ ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ముదిత్ కపూర్ నిర్వహించారు. బెంగుళూరు జిల్లాలో షెడ్యూల్‌ చేయని 22 కంటే తక్కువ, 84 షెడ్యూల్ కాని భాషలు మాట్లాడతారని విశ్లేషణలో వెల్లడించారు.