6 students murder case : విద్యార్థులను కొట్టి చంపిన కేసు..13 మందికి ఉరిశిక్ష..19 మందికి జీవిత ఖైదు

విద్యార్ధులకు కొట్టి చంపిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 13మందికి ఉరిశిక్ష, మరో 19మందికి

6 students murder case : విద్యార్థులను కొట్టి చంపిన కేసు..13 మందికి ఉరిశిక్ష..19 మందికి జీవిత ఖైదు

Aminbazar 6 Students Murder Case

Aminbazar 6 students murder case..బంగ్లాదేశ్ లో విద్యార్థులను కొట్టి చంపిన కేసులో 13 మందికి ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. మరో 19మందికి జీవిత ఖైదు శిక్ష విధిస్తు సంచలన తీర్పునిచ్చింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగర శివార్లలో 10 ఏళ్ల క్రితం ఆరుగురు విద్యార్ధులను దొంగలుగా భావించి కొంతమంది దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్ధులు చనిపోయారు. ఈ కేసు అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ కేసుపై విచారణ కొనసాగిస్తు..ఢాకా రెండో అదనపు జిల్లా..సెషన్స్ జడ్జి ఇస్మత్ జహాన్ గురువారం (డిసెంబర్ 2,2021) సంచలన తీర్పునిచ్చారు. 13 మందికి ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. మరో 19మందికి జీవిత ఖైదు శిక్ష విధించటంతో పాటు ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా విధించారు.

Read more : Cobra Stuck in Beer Can: బీర్‌ క్యాన్‌లో దూరిన నాగుపాము..కిక్ రాలేదుగానీ.. చుక్కలు కనిపించాయి..

ఢాకాలోని వివిధ కాలేజీలు, స్కూల్స్ లో చదువుకునే కొందరు స్నేహితులు షబ్‌ ఏ బారాత్‌ పండగ సందర్భంగా 2011 జులై 18 రాత్రి సవార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అమీన్‌ బజార్‌ వంతెన వద్దకు సరదాగా వెళ్లారు. వారిని దోపిడీ దొంగలు భావించిన స్థానికులు విపరీతంగా కొట్టారు. ఈ క్రమంలో ఆరుగురు విద్యార్థులు మరణించారు. ఈ కేసులు విచారణ అనంతరం ఢాకా 2వ అదనపు జిల్లా, సెషన్‌ జడ్జి జహాన్‌.. 13 మందికి ఉరి శిక్ష, 19 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.

కాగా..ఈ కేసులో 57మంది నిందితులుగా ఉన్నారు.వీరిలో 40మంది ఇప్పటికే జైలులో ఉండగా ఒకరు మాత్రం బెయిల్ పై బయట ఉన్నారని న్యాయవాదులు తెలిపారు. ఈ కేసులో మొత్తం 57మంది నిందితులుగా ఉండగా 13మందికి ఉరి శిక్ష, 19మందికి జీవిత ఖైదీ శిక్ష విధించిన న్యాయస్థానం 25మందిని న్యాయస్థానం నిర్ధోషులుగా విడుదల చేసిందని తెలిపారు.షబ్‌ ఏ బారాత్‌ పండగ సందర్భంగా ఏడుగురు విద్యార్ధులు సరదగా అమీన్‌ బజార్‌ వంతెన వద్దకు వెళ్లగా స్థానికులు వీరిని దొంగలుగా భావించి దాడికి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్ధులు చనిపోగా..అల్ అమీన్ అనే విద్యార్థి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అమీన్ వయస్సు 32 ఏళ్లు.

Read more : Dinosaur : చిలీలో కొత్త డైనోసార్ జాతి గుర్తించిన పరిశోధకులు..

ఈ కేసులో సంచలన తీర్పు విధించిన సందర్భంగా అమీన్ మాట్లాడుతు..మేం విద్యార్ధులం దొంగలం కాదు అని ఎంతగా మొరపెట్టుకున్నా వినకండా దారుణంగా కొట్టారని..వారి దారుణానికి నా ఆరుగురు స్నేహితులు చనిపోయారని..కన్నీటితో తెలిపాడు.ఈ ఘటనపై దాదాపు 500 మంది గుర్తుతెలియని గ్రామస్తులపై ఆరోపణలు చేయడంతో పోలీసులు సవర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు యాంటీ క్రైమ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ ఏబీ)కి విచారణ బాధ్యతలు అప్పగించారు. జనవరి 2013లో, RAB ఈ కేసులో 60 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.అలా ఈకేసు విచారణలో కోర్టు సంచలన తీర్పునిచ్చింది.