మా దేశం నుంచి వెళ్లిపోండి..లేదంటే : బంగ్లా దేశీయులకు వార్నింగ్

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA) ప్రకంపనలు రేపుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 04:47 AM IST
మా దేశం నుంచి వెళ్లిపోండి..లేదంటే : బంగ్లా దేశీయులకు వార్నింగ్

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA) ప్రకంపనలు రేపుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA) ప్రకంపనలు రేపుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడేం జరుగుతుందోనని అంతా వర్రీ అవుతున్నారు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే.. మహారాష్ట్రంలో మరో దుమారం రేగింది. పోస్టర్లు కలకలం రేపాయి. మా దేశం నుంచి వెళ్లిపోండి.. అంటూ బంగ్లాదేశీయులను హెచ్చరిస్తూ పోస్టర్లు వెలిశాయి. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS) పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. రాయ్ ఘడ్ జిల్లా పవ్వేల్ లో ఈ పోస్టర్లు కనిపించాయి. మా దేశం నుంచి వెళ్లిపోండి.. లేదంటే.. ఎంఎన్ఎస్ స్టైల్ లో మిమ్మల్ని గెంటేస్తాం” అని పోస్టర్లలో ఉంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే, అతడి కొడుకు శివసేన నేత అమిత్ థాక్రే ఫొటోలు పోస్టర్ లో ఉన్నాయి.

ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. చర్చకు దారి తీశాయి. అయితే వీటిని ఎవరు ముద్రించారు, ఎవరు అతికించారు అనేది తెలియాల్సి ఉంది. ఎంఎన్ఎస్ పేరుతో పోస్టర్లు ఉండటంతో.. ఇది వారి పనే అని కొందరు అంటున్నారు. అయితే.. ఎంఎన్ఎస్ ను బద్నాం చేసేందుకు కుట్ర జరుగుతోందని అనే వారూ లేకపోలేదు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, స్థానికంగా నివాసం ఉంటున్న బంగ్లా దేశీయులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ దాడులు జరుగుతాయోనని భయం భయంగా గడుపుతున్నారు.