May 2021 : మే నెలలో బ్యాంకులకు సెలవులు..ఎప్పుడెప్పుడంటే

మే నెల వచ్చేస్తోంది. ఈ నెలలో మొత్తం 31 రోజులుంటే..12 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి.

May 2021 : మే నెలలో బ్యాంకులకు సెలవులు..ఎప్పుడెప్పుడంటే

May Bank

Bank Holidays : ప్రతి నెలా లాగానే..జీతాలు పడగానే..ఆదాయ ఖర్చులు చూసుకుంటుంటాం. వ్యాపారస్తులు, ఇతరులు బ్యాంకుల్లో లావాదేవీలు నిర్వహిస్తుంటారు. మే నెల వచ్చేస్తోంది. ఈ నెలలో మొత్తం 31 రోజులుంటే..12 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. ఎప్పటిలాగానే..శనివారం, ఆదివారాలతో పాటు..ఇతర పండుగలు రావడంతో …12 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు.

మొత్తం ఈ నెలలో ఐదు ఆదివారాలు వచ్చాయి (మే 02, మే 09, మే 16, మే 23, మే 30). అంతేగాకుండా..మే 08వ తేదీన రెండో శనివారం, మే 22వ తేదీన నాలుగో శనివారం వచ్చాయి. ఏడు రోజులు సాధారణ సెలవులు కావడంతో ఈ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవు. ఇక మే 01వ తేదీ మేడే, మే 07వ తేదీ జుమాతుల్ విదా, మే 13వ తేదీన ఈదుల్ ఫితర్, మే 14వ తేదీ రంజాన్, మే 26వ తేదీన బుద్ధపూర్ణిమలు వచ్చాయి. మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి.

ఇదిలా ఉంటే..భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో బ్యాంకుల సమయాల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కేవలం నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తున్నాయి. 50 శాతం ఉద్యోగులు మాత్రమే బ్యాంకుల్లో పనిచేస్తున్నారు. సో..మే నెలలో ముఖ్యమైన లావాదేవీలు ఏమైనా ఉంటే..ప్లాన్ ప్రకారం నిర్వహించుకుంటే మంచిందని, డిజిటల్ పేమెంట్స్ బెటరని నిపుణులు సూచిస్తున్నారు.

Read More : MI vs RR : రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ విజయ దరహాసం