Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా

టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డేటింగ్ యాప్ ల పేరుతో యువతను పక్కదారిపట్టిస్తూ కొందరు మహిళలు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. డేటింగ్ యాప్ లో పరిచయమైన అపరిచితురాలి మాటలు నమ్మి ఓ బ్యాంక్ మేనేజర్ రూ.5.81కోట్లు పోగొట్టుకున్నాడు.

Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా

Dating App

Dating App: టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డేటింగ్ యాప్ ల పేరుతో యువతను పక్కదారిపట్టిస్తూ కొందరు మహిళలు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. డేటింగ్ యాప్ లో పరిచయమైన అపరిచితురాలి మాటలు నమ్మి ఓ బ్యాంక్ మేనేజర్ రూ.5.81కోట్లు పోగొట్టుకున్నాడు. చివరికి బ్యాంక్ లో డబ్బు కాజేశాడంటూ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అసలు విషయానికొస్తే.. బెంగళూరు హనుమంతనగర్ లోని ఓ బ్యాంకులో హరిశంకర్ మేనేజరుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. నాలుగు నెలల క్రితం ఓ డేటింగ్ యాప్ ను తన ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని తనపేరు రిజిస్ట్రర్ చేసుకున్నాడు.

Subba Rao Arrest : ఎంత పని చేశావ్ సుబ్బారావ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్..?

కొద్దిరోజుల తరువాత ఆ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. రోజు యాప్ ద్వారా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. వీడియోకాల్స్ ద్వారా, మెస్సేజ్ ల ద్వారా ప్రేమ సందేశాలు పంపుకుంటూ ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. తన మాయమాటలతో బ్యాంక్ మేనేజర్ ను ఆ యువతి నమ్మించింది. ఈ క్రమంలో ఓ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నువ్వు ఏమైనా పెట్టుబడి పెడతావా అని అడిగింది. అందుకు హరిశంకర్ తొలుత అదేంలేదని చెప్పినప్పటికీ తరువాత యువతి మాయమాటలు నమ్మి  రూ. 12లక్షలు బదిలీ చేశాడు. కొద్దిరోజులకు మరింత ఎక్కువ నగదు కావాలని చెప్పడంతో తన బ్యాంక్ లోని పెద్ద మొత్తంలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన అనిత అనే సీనియర్ సిటిజన్ ఖాతాపై రూ. 6కోట్లు రుణాన్ని తన పేరిట తీసుకొని తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు.

Telangana Covid Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు

మొత్తం రూ.5.69కోట్లను యువతి అకౌంట్ కు బదిలీ చేశాడు. ఆ తరువాతి రోజు నుంచి యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ క్రమంలో రుణానికి సంబంధించి అనిత ఫోన్ కు మెస్సేజ్ లు వెళ్లడంతో ఆమె బ్యాంక్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం కాస్త పోలీసుల వద్దకు వెళ్లడంతో బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. తనను మోసంచేసి ఓ యువతి డబ్బులు తీసుకుంది. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని వెల్లడించారు. బ్యాంకు రుణం తీసుకొనేందుకు అక్కడే పనిచేస్తున్న మనిరాజు అనే క్లర్క్ సహకరించాడని గుర్తించిన పోలీసులు అతన్ని కూడా అదుపులోకి విచారిస్తున్నారు.