ముందే చక్కబెట్టుకోండి : 7 రోజుల్లో.. 6 రోజులు బ్యాంకులకు సెలవు

ముందే చక్కబెట్టుకోండి : 7 రోజుల్లో.. 6 రోజులు బ్యాంకులకు సెలవు

నెలాఖరులో బ్యాంకులు దాదాపు విశ్రాంతిలో ఉండనున్నాయి. సెప్టెంబర్ 26నుంచి సెప్టెంబర్ 30వరకూ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు మూతపడినట్లే. రెండ్రోజుల పాటు దేశవ్యాప్తంగా బంద్‌లో భాగంగా సెప్టెంబర్ 26న బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత 28వ తేదీ నాలుగో శనివారంలో భాగంగా మామూలుగానే సెలవు దినం.

సెప్టెంబర్ 29 ఆదివారం. అర్ధ వార్షికం సందర్భంగా సెప్టెంబర్ 30న సెలవు. ఇన్ని వరుస సెలవుల అనంతరం అక్టోబర్ 1న విధులకు వచ్చేవాళ్లు తక్కువ కాబట్టి.. ఆ రోజు ఉన్నా పనులు జరుగుతాయో లేదో అనుమానమే. ఇక చివరిగా అక్టోబర్ 2న గాంధీ జయంతి. వరుస సెలవులు కాబట్టి సెప్టెంబర్ 25 తర్వాత బ్యాంకులు మళ్లీ పనిచేసేది అక్టోబర్ 3వ తేదీ నుంచి మాత్రమే. 

బ్యాంకుల సెలవు ఏటీఎంలపైనా కనిపిస్తుంది కాబట్టి సెప్టెంబర్ 27 తర్వాత ఏటీఎంలన్నీ ఖాళీగా కనిపిస్తాయి. ముందుగా అలర్ట్ అయితే మాత్రం డబ్బులు డ్రా చేసుకుని చేతిలో పెట్టుకోండి. ఎందుకంటే అన్ని చోట్లా డిజిటల్ ట్రాన్‌సాక్షన్లు చేయలేం కదా.