Enforcement Directorate : మాల్యా,చోక్సీ, నీరవ్ మోదీ ఆస్తులు బ్యాంకులకు బదిలీ

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

Enforcement Directorate : మాల్యా,చోక్సీ, నీరవ్ మోదీ ఆస్తులు బ్యాంకులకు బదిలీ

Ed

Enforcement Directorate భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా పరారైన ఆర్థిక నేరగాళ్ళు అని ముంబైలోని మనీలాండరింగ్ నిరోధక న్యాయస్థానం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరికి సంబంధించ ఆస్తులను గతంలో ఈడీ సీజ్ చేయగా..ఇప్పుడు ఆ సీజ్ చేసిన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రకటించింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA)కింద ఈ ముగ్గురికి సంబంధించి రూ. 18,170.02 కోట్లను ఈడీ గతంలో సీజ్ చేసింది. ఇందులో రూ. 969 కోట్ల విలువైన ఆస్తులు విదేశాల్లో ఉన్నాయి. బ్యాంకులకు వీరు చెల్లించాల్సిన బకాయిల్లో ఈ ఆస్తుల విలువ 80.45 శాతంగా ఉంది. ఆస్తుల బదిలీ వల్ల బ్యాంకులకు సగం మేర రుణాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది.

మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ.18,170.02 కోట్లు స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా, దీనిలో సగ భాగం రూ.9,371.17 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు బుధవారం ఈడీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ముంబైలోని పీఎంఎల్ఏ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆస్తులను బదిలీ చేశారు. ఆస్తుల బదిలీ వల్ల బ్యాంకులకు సగం మేర రుణాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ముగ్గురినీ స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.