ATMs: ఏటీఎమ్‌లో డబ్బులు పెట్టని బ్యాంకులకు జరిమానా

ఏటీఎంలలో డబ్బులు ఉంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇకపై బ్యాంకులకు భారీగా జరిమానా పడుతుంది. నగదు కొరత కారణంగా వినియోగదారుడు ఏటీఎం నుంచి ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తే రూ.10వేల జరిమానా కట్టాల్సి వస్తుందని బ్యాంకులకు స్పష్టం చేసింది ఆర్‌బీఐ.

ATMs: ఏటీఎమ్‌లో డబ్బులు పెట్టని బ్యాంకులకు జరిమానా

Atms

ATMs: ఏటీఎంలలో డబ్బులు ఉంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇకపై బ్యాంకులకు భారీగా జరిమానా పడుతుంది. నగదు కొరత కారణంగా వినియోగదారుడు ఏటీఎం నుంచి ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తే రూ.10వేల జరిమానా కట్టాల్సి వస్తుందని బ్యాంకులకు స్పష్టం చేసింది ఆర్‌బీఐ. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏ బ్యాంకైతే డబ్బులు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో? సంబంధిత బ్యాంకుకు జరిమానా విధిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తెలిపింది.

ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నెలలో గరిష్టంగా 10గంటలపాటు నగదు కొరతకు అనుమతి ఇస్తామని ఆర్‌బిఐ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఏటీఎంలో ఎక్కువ కాలం డబ్బులు పెట్టుకుండా ఉన్నట్లు తేలితే, బ్యాంక్ ప్రతి ATMకి రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ATMల వద్ద నగదు కొరత సమస్యతో కస్టమర్లు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే ఈమేరకు నిర్ణయం తీసుకుంది ఆర్‌బీఐ. నోట్ల జారీ బాధ్యత ఆర్‌బీఐ చూసుకుంటుందని చెప్పింది.

దేశవ్యాప్తంగా ఉన్న ATM ల నెట్‌వర్క్ ద్వారా కష్టమర్లకు నోట్లను అందించే బాధ్యత బ్యాంకులకు ఉందని, బ్యాంకులు మరియు వైట్ లేబుల్ ATM (RBI ద్వారా ATMలను మాత్రమే నిర్వహించడానికి లైసెన్స్ ఇచ్చిన కంపెనీలు) ఆపరేటర్లు తమ సిస్టమ్‌లలో డబ్బులను క్రమం తప్పకుండా నిల్వ చేయాలని, తమ కింద ఉన్న ఏటీఎంలలో డబ్బులు కొరత లేకుండా చూసుకోవాలని సూచించింది. ATMలలో నగదు కొరత చాలా తీవ్రంగా పరిగణించబడుతుందని, పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఆర్‌బీఐ చెప్పింది.