Banks Close : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక.. వారం రోజులు క్లోజ్

బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పనుంటే అలర్ట్ అవ్వండి. మీ పనులను షెడ్యూల్ చేసుకోండి. ఎందుకుంటే..

Banks Close : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక.. వారం రోజులు క్లోజ్

Banks Remains Closed For Seven Days1

banks remains closed for seven days : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పనుంటే అలర్ట్ అవ్వండి. మీ పనులను షెడ్యూల్ చేసుకోండి. ఎందుకుంటే బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి.

ఇప్పటికే మార్చి నెలలో వరుస సెలవుల కారణంగా బ్యాంక్‌ లావాదేవీలకు బ్రేక్ పడగా… మరో 7 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 4 వరకు చూస్తే.. కేవలం 2 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.

ఆర్బీఐ బ్యాంక్‌ హాలీడేస్‌ ప్రకారం.. బ్యాంకులు దాదాపు వారం రోజులు పనిచేయకపోవచ్చు. అయితే.. ఈ సెలవులు ప్రాంతం ప్రాతిపదికన మారతాయి. మార్చి 27 నుంచి 29 వరకు అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకులు పని చేయవు. 27న నాలుగో శనివారం కాగా… 28న ఆదివారం, 29న హోలీ పండుగ. అందువల్ల ఈ మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

అలాగే మార్చి 30న పాట్నాలో బ్యాంకులకు సెలవు ఉండగా మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు లభించవు. అలాగే ఏప్రిల్‌ 1న కూడా బ్యాంక్‌ సేవలు సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉండవు. ఇక ఏప్రిల్‌ 2న గుడ్‌ ఫ్రైడే. అంటే బ్యాంకులు 9 రోజుల్లో దాదాపు 7 రోజులు పనిచేయవు. కాబట్టి ఖాతాదారులు అలర్ట్ అవ్వడం మేలు. ఏమైనా ముఖ్యమైన లావాదేవీలు ముందే పూర్తి చేసుకోవడం బెటర్.