Banks Shut : అలర్ట్.. 7 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు

Banks Shut : అలర్ట్.. 7 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు

Banks Remains Closed For Seven Days1

Banks to remain shut for 7 days : మీకు బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పనుందా? అయితే వెంటనే చూసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. రానున్న 10 రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. ఈ నెల(మార్చి) 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

మార్చి 27తో మొదలు పెడితే ఏప్రిల్ 5 వరకూ బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. శని, ఆదివారాలు, పండ‌గ‌లు, ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు అంటూ మొత్తం 8 రోజుల పాటు బ్యాంకుల‌కు తాళాలు ప‌డ‌నున్నాయి. మ‌ధ్య‌లో కేవ‌లం మార్చి 30, ఏప్రిల్ 3న మాత్ర‌మే బ్యాంకులు ప‌ని చేస్తాయి. ఖాతాదారులకు సేవలు అందనున్నాయి. ఈ శుక్ర‌వారంలోపు మీ బ్యాంకు ప‌ని పూర్తి కాలేదంటే ఇక మీరు మ‌రో ప‌ది రోజులు వేచి చూడాల్సిందే.

సెలవులను దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకు ఉన్నతాధికారులు సూచించారు. ప్రధానంగా నెలాఖరు కావడంతో ఉద్యోగుల వేతనాలు, చెక్‌లు ఇతర చెల్లింపులు వంటి వాటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మార్చి 27: నాలుగో శ‌నివారం సెల‌వు
మార్చి 28: ఆదివారం
మార్చి 29: హోలీ పండుగ సెల‌వు
మార్చి 30 : పని చేస్తాయి
మార్చి 31: ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు సెల‌వు
ఏప్రిల్ 1: వార్షిక ఖాతాలను పూర్తి చేయ‌డానికి బ్యాంకులు మూత‌ప‌డ‌తాయి
ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే సెల‌వు
ఏప్రిల్ 3 : శ‌నివారం ప‌ని చేస్తాయి
ఏప్రిల్ 4: ఆదివారం
ఏప్రిల్ 5 : బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి

వరుస సెల‌వులు ఉన్నా.. ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్‌, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవ‌లు మాత్రం య‌థావిధిగా ప‌ని చేస్తాయని బ్యాంకు అధికారులు తెలిపారు. వరుస సెలవులు వచ్చినప్పుడు, ఏటీఎంలలో నగదు కొరత రాకుండా క్యాష్‌ చెస్ట్‌ నుంచి తీసి, నింపేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతిస్తుందని, అందువల్ల కంగారు పడాల్సిన అవసరం ఉండదని బ్యాంకు అధికారులు తెలిపారు.