Banks Loans: ఆరేళ్లలో బ్యాంకులు రద్దు చేసిన రుణాలు రూ.11 లక్షల కోట్లు.. వెల్లడించిన కేంద్రం

ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8,16,421 కోట్లు, కమర్షియల్ బ్యాంకులు రూ.11,17,883 కోట్లు గత ఆరేళ్లలో రద్దు చేశాయి. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలోపు కేంద్రం వద్ద ఉన్న సమాచారం.

Banks Loans: ఆరేళ్లలో బ్యాంకులు రద్దు చేసిన రుణాలు రూ.11 లక్షల కోట్లు.. వెల్లడించిన కేంద్రం

Banks Loans: గడిచిన ఆరేళ్లలో దేశంలో బ్యాంకులు రూ.11.17 లక్షల కోట్ల రుణాలు రద్దు చేశాయని పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ ఈ విషయంపై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం నిరర్ధక ఆస్తుల్ని రద్దు చేయడం వంటి చర్యల ద్వారా రుణాల్ని రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు.

Bihar: రోజు కూలీకి ఐటీ అధికారుల షాక్.. రూ.14 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు

ఆర్బీఐ డాటా ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8,16,421 కోట్లు, కమర్షియల్ బ్యాంకులు రూ.11,17,883 కోట్లు గత ఆరేళ్లలో రద్దు చేశాయి. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలోపు కేంద్రం వద్ద ఉన్న సమాచారం. అలాగే రూ.25 లక్షలకుపైగా రుణాల్ని రద్దు చేసిన రుణ గ్రహీతల వివరాల్ని కూడా కేంద్రం వెల్లడించింది. 2017 జూన్ 30 నాటికి పాతిక లక్షలకుపైగా రుణాలు రద్దైన వాళ్లు 8,045 మంది ఉండగా, జూన్ 30, 2022 నాటికి 12,439 మంది ఉన్నారు. ప్రైవేటు బ్యాంకుల్లో జూన్ 30, 2017 నాటికి రూ.25 లక్షల రుణాలు రద్దు చేసిన వారి సంఖ్య 1,616 మంది ఉండగా, జూన్ 30, 2022 నాటికి 2,447 మంది ఉన్నారు. బ్యాంకు మోసాలకు సంబంధించి 515 మందిపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈడీ జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.44,992 కోట్లుగా ఉంది.