G7-Foreign Ministers: ప్రపంచానికి అన్నం పెట్టండి: గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్‌కు జీ7 నేతల విజ్ఞప్తి

ప్రపంచం మొత్తం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడం తగదని, ఇది పరిస్థితిని ఇంకా దిగజార్చుతుందని జర్మనీ వ్యవసాయశాఖ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ అన్నారు.

G7-Foreign Ministers: ప్రపంచానికి అన్నం పెట్టండి: గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్‌కు జీ7 నేతల విజ్ఞప్తి

G7

G7-Foreign Ministers: గోధుమలు ఎగుమతిని తక్షణమే నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలనీ జీ-7 దేశాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రపంచం వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు జీ-7 దేశాల విదేశాంగ మంత్రులు మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. ఈసందర్భంగా యుక్రెయిన్ – రష్యా యుద్ధం సహా, ప్రపంచ ఆహార భద్రత, ఇంధన భద్రత, రష్యాకు చైనా మద్దతు, నార్త్ కొరియా క్షిపణి పరీక్షలు, భారత్ లో వడగాలుల తీవ్రత వంటి పలు కీలక అంశాలపై జీ-7 దేశాల ప్రతినిధులు చర్చించారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ సంక్షోభానికి దారి తీయనుందని జీ-7 దేశాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యుద్ధం కారణంగా యుక్రెయిన్ లో ఆహార ధాన్యాల దిగుమతి అత్యల్ప స్థాయికి పడిపోయిందని, దీంతో యుక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాలు ఎగుమతుల్లేక ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో తీవ్ర ఆహార కొరత ఏర్పడనుందని జీ-7 దేశాల ప్రతినిధులు హెచ్చరించారు.

Other Stories:Imran Khan: నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది.. దేశం మీద అణుబాంబు వేయడమే నయం..!

ప్రపంచం మొత్తం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడం తగదని, ఇది పరిస్థితిని ఇంకా దిగజార్చుతుందని జర్మనీ వ్యవసాయశాఖ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ అన్నారు. గోధుమల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న యుక్రెయిన్ లో ప్రస్తుతం యుద్ధం కారణంగా పంటలు తగ్గిపోయి ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రపంచ ఆహార సరఫరాలో అంతరాయానికి రష్యానే కారణమని జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పై విమర్శలు గుప్పించారు. ఆహార కొరత ఏర్పడితే దానికి రష్యానే పూర్తి భాద్యత వహించాల్సి ఉంటుందని ఓలాఫ్ స్కోల్జ్ అన్నారు. అయితే గోధుమల ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంపై జర్మనీ వ్యవసాయశాఖ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ కొంత అసహనం వ్యక్తం చేశారు.

Other Stories:Gun Firing in US: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం: 13 మంది మృతి

ఇలా ప్రతి దేశం ఆహార ధాన్యాల ఎగుమతులు నిలిపివేస్తే ఇతర దేశాల్లో ప్రజలు ఆకలితో అలమటిస్తారని, తద్వారా సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని సెమ్ ఓజ్డెమిర్ అన్నారు. జీ-20 సభ్య దేశంగా ప్రపంచానికి ఆహారం అందించే భాద్యత భారత్ తీసుకోవాలని, గోధుమల ఎగుమతిపై భారత ప్రభుత్వం పునరాలోచన చేయాలనీ సెమ్ ఓజ్డెమిర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే భారత్ పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ లలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందని..కావునా, గోధుమల ఎగుమతి పై భారత్ తగిన నిర్ణయం తీసుకోవాలని జర్మనీ వ్యవసాయశాఖ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ కోరారు. త్వరలో జర్మనీలో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని, ఆమేరకు గోధుమల ఎగుమతిపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు సెమ్ ఓజ్డెమిర్ పేర్కొన్నారు.

మరోవైపు..భారత్ నుంచి గోధుమల ఎగుమతి నిషేధంపై జీ-7 దేశాల వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి శనివారం స్పందిస్తూ..ప్రపంచ దేశాలకు గోధుమల ఎగుమతిని పూర్తిగా నిలిపివేయలేదని, ఆహార భద్రతపై ముందు నుంచి తమపై నమ్మకం ఉంచిన దేశాలకు భారత్ ఆపన్న హస్తం కొనసాగుతుందని స్పష్టం చేసారు. అదే విధంగా ముందుగా కలిగి ఉన్న ఒప్పందం ప్రకారం ఆయా దేశాలకు కూడా గోధుమల ఎగుమతులు కొనసాగుతున్నట్టు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, భారత్ లోనూ గోధుమల రేటు పెరిగిపోవడంతో, దేశీయంగా ధరల నియంత్రణ కోసమే ఎగుమతులపై నిషేధం విధించినట్లు హర్దీప్ సింగ్ పేర్కొన్నారు.

Other Stories:Amit Shah On MinorityReservations : అధికారంలోకి వ‌చ్చాక‌.. మైనారిటీ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు-అమిత్ షా సంచలన ప్రకటన