బిగ్ రిలీఫ్: ఢిల్లీలో అన్నీ ఓపెన్.. ఆ ఒక్కటి తప్ప

  • Published By: Subhan ,Published On : June 1, 2020 / 07:01 AM IST
బిగ్ రిలీఫ్: ఢిల్లీలో అన్నీ ఓపెన్.. ఆ ఒక్కటి తప్ప

బార్బర్ షాపులు, సెలూన్లతో సహా ఢిల్లీ అన్నీ దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ బోర్డర్లు ఓపెన్ చేయడంపై సిటిజన్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని ఆ తర్వాతే ఫైనల్ చేస్తామని వెల్లడించారు. అన్నీ షాపులు ఓపెన్ చేసినప్పటికీ స్పాలకు మాత్రం పర్మిషన్‌లు ఇవ్వలేదు. పెరుగుతున్న వైరస్‌ కేసులు తగ్గడానికి మరింత కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 

మేం బోర్డర్లు ఓపెన్ చేస్తే.. దేశవ్యాప్తంగా ప్రజలు ట్రీట్‌మెంట్ కోసం ఢిల్లీకి వస్తారు. ఢిల్లీ హాస్పిటల్ మాత్రం ఢిల్లీ ప్రజలకు మాత్రం రిజర్వ్ చేసి ఉంచారు. అదే సమయంలో ఢిల్లీ అనేది దేశానికి చెందినదే. అందుకని దేశ ప్రజలకు ట్రీట్‌మెంట్ చేయమని ఎలా నిరాకరించగలం’ అని కేజ్రీవాల్ అన్నారు. 

దేశంలో ప్రస్తుతం 93వేల 322యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. భారత్ లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 48.18శాతంగా ఉంది. మొత్తం ప్రపంచంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 61 మిలియన్లను దాటింది.  సీఎం ఇచ్చిన సమాచారం ప్రకారం.. COVID-19పేషెంట్ల బెడ్లు 9వేల 500 ఉన్నాయి. ‘ఓ సీఎంగా మీ కుటుంబంలో ఎవరికి ఇన్ఫెక్షన్ సోకినా బెడ్ రెడీగా ఉంటుందని చెప్పగలను. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఢిల్లీ బోర్డర్ ఓపెన్ లో ఉంచాలని అనుకుంటున్నాం. మీ అభిప్రాయాలు తెలియజేయండి. శుక్రవారానికి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. 

Read: బెడ్లు ఖాళీలేక కరోనా పేషెంట్లకు నేల మీదే ట్రీట్‌మెంట్