యూపీలో మార్పు ఇలా : ఆడాళ్లే షేవింగ్, కటింగ్ చేస్తారు

యూపీలో మార్పు ఇలా : ఆడాళ్లే షేవింగ్, కటింగ్ చేస్తారు

అది 2014.. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇద్దరు ఆడపిల్లలు తండ్రి సెలూన్‌కు వెళ్తారు. తండ్రికి సాయం చేయడంతో పాటు షేవింగ్, హెయిర్ కట్ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఇంటిని ఆర్థికంగా వృద్ధి చేసుకోవాలని అదే పనిని కొనసాగించారు. స్కూల్‌కు వెళ్లి చదువుకుని సాయంత్రం వచ్చి సెలూన్‌లో పని చేసుకోవడమే అలవాటుగా మార్చుకున్నారు. 

వయస్సు పెరిగే కొద్దీ ధైర్యంగా సెలూన్‌ను స్వయంగా నడిపేస్థాయికి ఎదిగారు. సాధారణంగా బ్యూటీ పార్లర్.. మరి కొన్ని చోట్లా ఆడాళ్లు హెయిర్ కట్ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ, గల్లీ షాప్‌లలో ఇలా చూడడం అరుదు. పైగా తండ్రికి సపోర్ట్ ఇచ్చేందుకు కూతుళ్లైనా బాధ్యతను పంచుకోవడం స్థానికులను కట్టిపడేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బన్వరీ తొలా గ్రామంలో జరిగిన ఘటనను జిల్లేట్ సంస్థ కమర్షియల్ యాడ్ రూపంలో తెరకెక్కించింది. 

ఆ యాడ్‌లో ఓ పిల్లోడు.. ‘ఆడుతూ అటుఇటు తిరుగుతూ హెయిర్ సెలూన్‌లో ఆడాళ్లు ఉండటం. మగాళ్లు వచ్చి వెళ్లడం గమనిస్తుంటాడు. సెలూన్‌లో ఆడపిల్లలు షేవింగ్ చేయడం చూస్తాడు. తన తండ్రితో పాటు ఓ సారి సెలూన్‌కి వెళ్లి తండ్రిని లేడీస్ షేవింగ్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తాడు. అప్పుడు తండ్రి గడ్డం గీయడానికి వాడే రేజర్ పట్టుకుంది మగా, ఆడా అనే తేడా చూడదు’ అని చెప్పడంతో యాడ్ ముగుస్తుంది. 

ఈ యాడ్‌తో పాటు.. ఆ బాలికలిద్దరిపైనా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆ గ్రామమంతా హ్యాట్సాఫ్ చెబుతుండటంతో పాటు వారికి మద్దతిచ్చే వారు కూడా పెరిగిపోయారు. వారి గురించి ప్రజలందరికీ తెలియజెప్పిన జిల్లెట్‌ను ప్రశంసిస్తున్నారు.