బార్లు ఓపెన్..ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే

  • Published By: madhu ,Published On : August 7, 2020 / 12:20 PM IST
బార్లు ఓపెన్..ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే

కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా తాళాలు పడిన బార్లు ఎప్పుడు తెరుచుకుంటాయి ? ఒక్కో పెగ్గు కొడుతూ..తమ దోస్తులతో ఎప్పుడు ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్న వారి కలలు నెరవేర్చింది ప్రభుత్వం. బార్లు ఓపెన్ చేసుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.



నిబంధనలకు లోబడి బార్లు తెరుచుకోవచ్చని సూచించింది. ఏ ప్రభుత్వం ? ఎక్కడ ? మీరు అనుకుంటున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు.

కరోనా కారణంగా భారతదేశంలో నిబంధనలతో కూడుకున్న ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాలు కొన్నింటికి పర్మిషన్ ఇచ్చినా..బార్లు, పబ్బులకు నో చెప్పింది. కానీ అసోం ప్రభుత్వం మాత్రం మందుబాబుకు గుడ్ న్యూస్ వినిపించింది. మూతపడిన బార్లను తెరుచుకోవచ్చని చెప్పింది.



ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని షరతు విధించింది. ఆన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతొక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచించారు.

బార్లలో తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రాష్ట్రంలో 50 వేల 445 కరోనా కేసులు రిజిస్టర్ కాగా..వీరిలో 35 వేల 892 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో గురువారం 2 వేల 372 కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి. మొత్తం రాష్ట్రంలో 55 వేల 671 కేసులున్నాయి. 35 వేల 892 మంది కోలుకున్నారు. 16 వేల 796 యాక్టివ్ కేసులున్నాయి. 126 మంది చనిపోయారు.