సీఏఏ ఆందోళనలను అదుపుచేయండి, లేదంటే మాకు అప్పగించండి

సీఏఏ ఆందోళనలను అదుపుచేయండి, లేదంటే మాకు అప్పగించండి

ఢిల్లీలోని మౌజ్‌పూర్ ప్రాంతంలో సీఏఏ-సీఏఏ వ్యతిరేకుల మధ్య జరుగుతున్న ఆందోళనలపై కపిల్ మిశ్రా వార్నింగ్ ఇస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన కపిల్.. ఢిల్లీ పోలీసులకు మూడు రోజులు మాత్రమే గడువు ఇస్తున్నట్లు హెచ్చరించాడు. షహీన్‌బాగ్, జఫ్రాబాద్ ప్రాంతాల్లో సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మిడిల్ టౌన్ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన కపిల్.. ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. ‘జఫ్రాబాద్, చాంద్ భాగ్ ప్రాంతాల్లో సీఏఏ వ్యతిరేకుల ఆందోళనలను పోలీసులు 3రోజుల్లో అదుపుచేయాలి. అప్పటికీ పరిస్థితి ఇలానే ఉంటే మమ్మల్ని ఎవరూ ఆపలేరు’ సీఏఏ వ్యతిరేకులు ఢిల్లీని తగలబెట్టాలని చూస్తున్నారు. 

ఆ కారణంతోనే ఢిల్లీ రోడ్లని బ్లాక్ చేసి వీధుల్లో ఆందోళనలు చేస్తున్నారు. వాళ్లపై మేం ఒక్కరాయి కూడా విసరలేదని అన్నాడు. దాంతో పాటు ఢిల్లీ డీసీపీ సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసి.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రాక సందర్భంగా మేం శాంతి వహిస్తున్నాం. ఈ మూడు రోజుల్లో అదుపుకాకపోతే మేం ఎవరిమాటా వినం’ అంటున్నాడు. 

సీఏఏ-యాంటీ సీఏఏ ఆందోళనలపై మాట్లాడేందుకు కపిల్ మిశ్రా మౌజ్‌పూర్ ప్రాంతంలో పర్యటించిన తర్వాత అల్లర్లు పెరిగాయి. కొందరు వ్యక్తులు రాళ్లతో కొట్టుకుంటూ ఆందోళన సృష్టించారు. వీరిని అదుపుచేయడానికి పోలీసులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లలేదు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. అరెస్ట్ కపిల్ మిశ్రా #ArrestKapilMishra అనే హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సీఏఏ వ్యతిరేకులపై టియర్ గ్యాస్ వంటివి వాడి అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఇక్కడ అలాంటివి ఎందుకు వాడరంటూ ప్రశ్నిస్తున్నారు.