Karnataka CM: నేడే బొమ్మై ప్రమాణస్వీకారం.. 8నెలలే ముఖ్యమంత్రిగా బొమ్మై తండ్రి.. ఎందుకంటే?

క‌ర్నాట‌క తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై, ఈరోజు(28 జులై 2021) ప్రమాణస్వీకారం చేయనున్నారు. శక్తివంతమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్ప స్థానంలో అతనికి సన్నిహితుడిగా, నమ్మకస్తుడైన బొమ్మై కర్నాటక ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు.

Karnataka CM: నేడే బొమ్మై ప్రమాణస్వీకారం.. 8నెలలే ముఖ్యమంత్రిగా బొమ్మై తండ్రి.. ఎందుకంటే?

Bommai

Karnataka CM: క‌ర్నాట‌క తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై, ఈరోజు(28 జులై 2021) ప్రమాణస్వీకారం చేయనున్నారు. శక్తివంతమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్ప స్థానంలో అతనికి సన్నిహితుడిగా, నమ్మకస్తుడైన బొమ్మై కర్నాటక ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు. యడ్యూరప్ప బసవరాజ్ పేరును ప్రతిపాదించగా.. ధర్మేంద్ర ప్రధాన్ బొమ్మై పేరును ప్రకటించాడు. బసవరాజ్ ఉదయం 11 గంటలకు బెంగళూరులోని రాజ్‌భవన్‌లో 30వ ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

61 ఏళ్ల బసవరాజ్ బొమ్మై 28 జనవరి 1960న హుబ్లిలో జన్మించారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజ్ బొమ్మై. భుమరాడి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి 1982లో తన బీఈ డిగ్రీ సాధించాడు బొమ్మై. బసవరాజ్ బొమ్మై భార్య పేరు చెన్నమ్మ, వారికి ఇద్దరు పిల్లలు. బసవరాజ్ బొమ్మై ఈ ఏడాది ప్రారంభంలో కర్నాటక హోంమంత్రిగా పనిచేశారు.

అతని పూర్తి పేరు బసవరాజ్ సోమప్ప బొమ్మై, మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ విద్య‌ను అభ్య‌సించారు. బ‌స‌వ‌రాజు పారిశ్రామిక వేత్త‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వ్య‌వ‌సాయ రంగంలో అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చిన నేత‌గా బొమ్మై కుటుంబానికి క‌ర్నాట‌క‌లో గుర్తింపు ఉంది. 2008లో జ‌న‌తాద‌ళ్ నుంచి బీజేపీలో చేరిన బొమ్మై, య‌డ్యూర‌ప్ప ప్ర‌భుత్వంలో హోంశాఖ మంత్రిగా ప‌నిశారు.

టాటా గ్రూపులో ఉద్యోగం:
మాజీ కర్నాటక ముఖ్యమంత్రి ఎస్.ఆర్. బొమ్మై కుమారుడు బసవరాజ్ మెకానికల్ ఇంజనీరింగ్‌ చేసి, టాటా గ్రూపుతో ఉద్యోగం చేశాడు. మెకానికల్ ఇంజనీర్ కాకుండా, అతను రైతు మరియు వృత్తిరీత్యా పారిశ్రామికవేత్త కూడా. కర్ణాటక జనాభాలో 17 శాతం జనాభా ఉన్న లింగాయత్‌లు గణనీయమైన రాజకీయ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అసెంబ్లీ విషయానికొస్తే, 30 శాతం సీట్లలో ప్రభావం చూపుతారు.

ఎనిమిది నెలలు ముఖ్యమంత్రిగా సీనియర్ బొమ్మై:
బసవరాజు బొమ్మై తండ్రి ఎస్ఆర్ బొమ్మై స‌రిగ్గా 31ఏళ్ల క్రితం కొద్దికాలం సీఎంగా ప‌నిచేశారు. 1988 ఆగ‌స్టు 13న రాష్ట్ర సీఎంగా ఎస్ఆర్ బొమ్మై ప్ర‌మాణ స్వీకారం చేశారు. కానీ ఆయ‌న ఎంతో కాలం ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌లేక‌పోయారు. అయితే, మెజారిటీ లేదంటూ.. 1989 ఏప్రిల్ 21న అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం 356వ అధిక‌ర‌ణాన్ని ఉప‌యోగించి బొమ్మై ప్రభుత్వాన్ని కూల‌దోసి, రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించింది. మెజారిటీ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డడంతో ఈ పరిస్థితి వచ్చింది. దీంతో సీనియర్ బొమ్మై ఎనిమిది నెలలే ముఖ్యమంత్రిగా ఉన్నారు.