Indian Team : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత జట్టు ప్రకటన..కెప్టెన్ గా రాహుల్

జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ-20 మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత్-దక్షిణాఫ్రికా మధ్య మొత్తం ఐదు టీ-20 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. జూన్‌ 9న ఢిల్లీ, 12న కటక్‌, 14న విశాఖ, 17న రాజ్‌కోట్‌, 19న బెంగళూరులో టీ20 మ్యాచులు జరుగనున్నాయి.

Indian Team : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత జట్టు ప్రకటన..కెప్టెన్ గా రాహుల్

Indian Team

Indian team : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత జట్టు బీసీసీఐ ప్రకటించింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు కెప్టెన్ గా కేఎల్ రాహుల్, వైఎస్ కెప్టెన్ గా పంత్ వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్ లను తిరిగి జట్టులోకి తీసుకున్నారు.

జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ-20 మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత్-దక్షిణాఫ్రికా మధ్య మొత్తం ఐదు టీ-20 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. జూన్‌ 9న ఢిల్లీ, 12న కటక్‌, 14న విశాఖ, 17న రాజ్‌కోట్‌, 19న బెంగళూరులో టీ20 మ్యాచులు జరుగనున్నాయి.

Skull Metal Plate: టీమిండియా మాజీ కెప్టెన్ తల నుంచి మెటల్ ప్లేట్ తొలగింపు

టీ20 జట్టులో కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, వెంకటేశ్‌ అయ్యర్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ ఉన్నారు.

జులై 1 నుంచి ఇంగ్లాండ్‌ పర్యటన మొదలవుతుంది. టీమిండియా అక్కడ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. అంతకన్నా ముందు ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఉంటాయి.