Sourav Ganguly: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ నిర్వహిస్తాం

ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం నిర్వహించిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో ఎవరూ ఊహించని రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయాన్ని రాబట్టింది. 2023 నుంచి 2027 సంవత్సరాలకు గాను మీడియా హక్కులను రూ. 48,390.32 కోట్లకు విక్రయించడంతో ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐ నిలిచింది.

Sourav Ganguly: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ నిర్వహిస్తాం

Sourav Ganguly

Sourav Ganguly: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం నిర్వహించిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో ఎవరూ ఊహించని రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయాన్ని రాబట్టింది. 2023 నుంచి 2027 సంవత్సరాలకు గాను మీడియా హక్కులను రూ. 48,390.32 కోట్లకు విక్రయించడంతో ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐ నిలిచింది. అంతేకాక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ కలిగిన ప్రముఖ ఫుట్‌బాల్‌ లీగ్‌ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను వెనక్కునెట్టిన ఐపీఎల్‌.. విలువ పరంగా ప్రపంచంలో టాప్-2 లీగ్‌గా నిలిచింది.

IPL: ఐపీఎల్ వేలం.. ఒక బాల్‌కు రూ.49 లక్షల ఆదాయం

ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ పేర్కొన్నారు. ఇప్పటికే బీసీసీఐ మహిళా ఐపీఎల్ నిర్వహిస్తామని ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించినట్లుగానే వచ్చే ఏదాడి నుంచి ఉమెన్స్ ఐపీఎల్ ను ఖచ్చితంగా నిర్వహిస్తామని గుంగూలీ స్పష్టం చేశారు. ఐపీఎల్ మీడియా హక్కుల వేలంపై గంగూలీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం విజయవంతం కావడంతో క్రికెట్ క్రీడకు దేశంలో అత్యంత బలమైన పునాధి ఉందని మరోసారి రుజువైందని తెలిపారు. యువ ఆటగాళ్లందరికీ ఇది అతిపెద్ద ప్రేరణగా నిలిచిందని తెలిపారు.

IPL Media Rights: రికార్డ్ బ్రేక్ చేసిన ఐపీఎల్, ప్రపంచంలోనే రెండో లీగ్‌గా

అయితే ఆట ఎప్పుడూ డబ్బు గురించి కాదని, అది ప్రతిభకు సంబంధించినదని అన్నారు. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మన దేశంలో ఆట ఎంత బలంగా ఉందో చూపించిందని, యువ ఆటగాళ్లందరూ తమ సామర్థ్యాన్ని, టీమ్‌ ఇండియాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ సంఖ్యలే అతిపెద్ద ప్రేరణగా నిలుస్తాయని గంగూలీ పేర్కొన్నారు