Indian Cricket Team : బంగ్లాదేశ్ తో తొలి టెస్టుకు భారత జట్టులో పలు మార్పులు

బంగ్లాదేశ్ తో జరుగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

Indian Cricket Team : బంగ్లాదేశ్ తో తొలి టెస్టుకు భారత జట్టులో పలు మార్పులు

Indian cricket team

Indian Cricket Team : బంగ్లాదేశ్ తో జరుగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఛెతేశ్వర్ పుజారా వైఎస్ కెప్టెన్ గా నియామయం అయ్యారు.  అలాగే రోహిత్ స్థానంలో భారత జట్టు-ఏ కెప్టెన్ అభిమన్య ఈశ్వరన్ ను జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈశ్వరన్ బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నారు.

బంగ్లాదేశ్-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్ లో భారత్-ఏ జట్టు కెప్టెన్ గా ఈశ్వరన్ వ్యవహరించగా సిరీస్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశారు. బంగ్లాదేశ్ -ఏ జట్టుతో జరిగిన తొలి టెస్టులో ఈశ్వరన్ 141 పరుగులు చేశారు. రెండో టెస్టులో 157 పరుగులతో రాణించారు. ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా గాయం కారణంగా మొత్తంగా సిరీస్ కే దూరం అయ్యారు. భుజం గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోలేదని, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు సిరీస్ కు దూరమయ్యారని బీసీసీఐ పేర్కొంది.

Bangladesh vs India: బంగ్లాదేశ్‌పై 227 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

షమీ, జడేజాల స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ ను జట్టులోకి తీసుకున్నారు. రెండో వన్డేలో రోహిత్ బొటన వేలికి గాయమైందని, ముంబయిలోని స్పెషలిస్టున కలిస్తే విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు బీసీసీఐ తెలిపింది. అయితే రోహిత్ స్థానంలో ఈశ్వరన్ జట్టులోకి వచ్చినప్పటికీ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి టెస్టులో కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ ఓపెనింగ్ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్ తో తొలి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టులో
కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఛెతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవి చంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూర్ ఠాకూర్ , మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.