BCCI విలక్షణ తీర్పు : పాండ్యా..రాహుల్‌కు రూ. 20 లక్షల ఫైన్

  • Published By: madhu ,Published On : April 20, 2019 / 07:54 AM IST
BCCI విలక్షణ తీర్పు : పాండ్యా..రాహుల్‌కు రూ. 20 లక్షల ఫైన్

కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున  టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లపై బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డికె జైన్ సారథ్యంలోని కమిటీ విలక్షణ తీర్పును వెలువరించింది. క్రికెటర్లు ఇద్దరూ మొత్తంగా రూ.40లక్షలు చెల్లించాలని తీర్పులోని సారాంశం. 

ఒక్కో ప్లేయర్ విధుల్లో మృతి చెందిన ఒక్కో అమర జవాన్ కుటుంబానికి లక్ష చొప్పున పది కుటుంబాలకు, అంధుల క్రికెట్ బోర్డుకు రూ.10లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో ఆ డబ్బులు ఇచ్చేయాలని తెలిపింది. ఈ లెక్కన క్రికెటర్లు ఇద్దరూ కలిపి మొత్తం 20 కుటుంబాలకు రూ.20లక్షలు చెల్లించాలి. అంధుల క్రికెట్ బోర్డుకు రూ.20లక్షలు చెల్లించాలి. 
Also Read : ఇక రాజస్థాన్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్

కాఫీ విత్ కరణ్ టీవీ షోలో పాల్గొన్న రాహుల్..హర్థిక్‌లు మహిళలు, సెక్స్ తదితర అంశాల గురించి అసభ్యంగా మాట్లాడారు. వీటిపై ఆ తర్వాత తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. తప్పును సరిదిద్దుకుని క్షమాపణలు చెప్పినా.. శిక్షను అనుభవించక తప్పలేదు. BCCI వీరిద్దరిపై 2 మ్యాచ్ ల సస్పెన్షన్ వేటు వేసింది.

ఇరువురి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కొద్ది రోజుల తర్వాత ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. విచారణలో భాగంగా బీసీసీఐ అంబుడ్స్‌మన్ కు విచారణ అప్పగించింది సుప్రీంకోర్టు.