BE ALERT: వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో కనిపిస్తున్న కోవిడ్ లక్షణాలు ఇవే..!

కరోనా వైరస్‌ సోకినవారిలో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయని ఇప్పటివరకు మనకు తెలుసు.. అందులో ముఖ్యంగా దగ్గు, జ్వరం మరియు రుచి లేదా వాసన కోల్పోవడం. వాటిని గుర్తించగానే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

BE ALERT: వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో కనిపిస్తున్న కోవిడ్ లక్షణాలు ఇవే..!

Covid

Covid symptoms: కరోనా వైరస్‌ సోకినవారిలో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయని ఇప్పటివరకు మనకు తెలుసు.. అందులో ముఖ్యంగా దగ్గు, జ్వరం మరియు రుచి లేదా వాసన కోల్పోవడం. వాటిని గుర్తించగానే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు మొదటి నుంచి చెబుతున్నారు. ఆ లక్షణాలు కనిపించగానే ముందుగా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకుని, అందులో పాజిటివ్ వస్తే ఆర్‌టీపీసీఆర్ చేయించుకోవడం ఇప్పటివరకు నడస్తున్న పద్దతి.

అయితే, కరోనా సోకిన వ్యక్తుల నుంచి మరో వ్యక్తికి సోకడం ఇప్పుడు చాలావరకు తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణం వ్యాక్సినేషన్ కూడా. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందా? అంటే లేదు అనే సమాధానమే వినిపిస్తుంది. వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా వచ్చినవారిలో కొన్ని లక్షణాలు కనిపించవు. వ్యాక్సినేషన్ చేయించుకున్నవారిలో ముఖ్యంగా వస్తున్న లక్షణాలు మూడైతే, వాటిలో రెండు అసలు అధికారిక జాబితాలో కూడా లేవని డాక్టర్లు చెబుతున్నారు.

ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ప్రకారం,.. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా వస్తే ‘తుమ్ము’లు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. తలనొప్పి, ముక్కు కారటం మరియు గొంతునొప్పి కనిపిస్తుందని, మాములుగా వచ్చే జ్వరం లక్షణం కనిపించట్లేదని చెబుతున్నారు వైద్య నిపుణులు. వ్యాక్సిన్ 100 శాతం ప్రభావవంతంగా లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, కోవిడ్ వ్యాక్సిన్లు ప్రజలను తీవ్రమైన వ్యాధి మరియు ఆసుపత్రి ఇబ్బందులు నుంచి కాపాడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చింది అనే అనుమానం ఉంటే, ముఖ్యంగా పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ఆగకుండా దగ్గురావడం, గంటల తరబడి దగ్గు కొనసాగడం, 24గంటల్లో అలాంటి పరిస్థితులు రెండు మూడుసార్లు ఏర్పడితే మాత్రం కచ్చితంగా చేయించుకోవడం మంచిది. జ్వరం రాలేదని అనుకోవద్దు అని అంటున్నారు నిపుణులు. వాసన గుర్తించడంలో మార్పులు లేదా పూర్తిగా రుచి పోవడం వంటివి వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో అరుదుగా కనిపిస్తున్నట్లు రీసెర్చ్ చెబుతుంది.

వ్యాక్సిన్ వేయించుకోనివారిలో కొత్త వేరియంట్లు వ్యాప్తి ఎక్కువగా ఉండగా.. వారిలో ఎక్కువగా దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది. చలిగా ఉండటం, వణుకు కూడా ఈ వైరస్‌ సోకినవారిలో కనిపించే లక్షణాలు.. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ లక్షణాలు కనిపించడానికి కనీసం ఐదు రోజుల సమయం పడుతుంది. మరికొందరికి ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు. ఈ వైరస్‌ 14 రోజులవరకు శరీరంలో ఉండే అవకాశం ఉంది.