Tiger : ఎలుగుబంటి దెబ్బకు తోకముడిచిన పెద్దపులి

పులి పంజా విసిరితే ఎంత పెద్ద జంతువైనా కిందపడాల్సిందే.. కానీ కొన్ని సార్లు వేటాడాలనుకే జంతువు దైర్యం ముందు పులి పంజా పనిచేయదు, ఎంత బలం ఉన్నా తోకముడిచి పరుగు తీయాల్సి వస్తుంది.

Tiger : ఎలుగుబంటి దెబ్బకు తోకముడిచిన పెద్దపులి

Tiger

Tiger : పులిని చూస్తే సాదు జంతువులు పరుగులు తీస్తాయి. క్రూర జంతువులు కూడా బయపడిపోతుంటాయి. పులి పంజా విసిరితే అడవి దున్న కూడా కిందపడాల్సిందే. సరైన సమయంలో శబ్దం లేకుండా వేటాడటంతో పులితో పోటీ పడే వేట జంతువులు మారేది ఉండదు. అటువంటి పులి కూడా ఒకోసారి తోడవల్సి వస్తుంది. తాజాగా ఇటువంటిదే ఓ ఘటన చోటుచేసుకుంది.

రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో ఆకలితో ఉన్న పులి మరో క్రూర జంతువు ఎలుగుబంటిని వేటాడేందుకు సిద్ధమైంది. వెనుక నుంచి మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఎలుగుబంటి వద్దకు వెళ్లి ఒక్కసారిగా దానిపై పడింది. వెంటనే తేరుకున్న ఎలుగుబంటి పులికి ఎదురు తిరిగింది. దీంతో పులి పరుగులంఖించుకుంది. దాని వెంటే కొద్దీ దూరం పరుగు తీసింది ఎలుగు… ఎలుగుబంటి ప్రతిఘటనకు కంగుతున్న పులి వెనక్కు చూడకుండా పరుగుతీసింది.

దీనికి సంబంధించిన వీడియోను సుశాంత నందా అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ పిల్లిలా వెనక నుంచి వచ్చిన పులి.. చివరకు పిల్లిలా పరుగులు తీసింది’.. ‘ఎలుగుబంటి కోపానికి పులి భయంతో పరుగో.. పరుగో..’ అని కామెంట్లు చేస్తున్నారు.