Bears Raid On Meat Shops : చికెన్, మటన్ షాపులపై ఎలుగుబంట్ల దాడి .. లబోదిబోమంటున్న యజమానులు

ఎలుగు బంట్లు ఏకంగా చికెన్, మంటన్ షాపులపై దాడి చేసి అక్కడున్న మాంసాన్ని తినేస్తున్నాయి. చేపల్ని గుటకాయస్వాహా చేస్తున్నారు. దీంతో షాపుల యజమానులు లబోదిబోమంటున్నారు. ఎందుకంటే అవి ఎలుగు బంట్లాయే..కొట్టటానికి వెళితే ఎదురు దాడి చేస్తున్నాయి. దీంతో మాంసం షాపుల యజమానులు హడలిపోతున్నారు.

Bears Raid On Meat Shops : చికెన్, మటన్ షాపులపై ఎలుగుబంట్ల దాడి .. లబోదిబోమంటున్న యజమానులు

Bears raid chicken, mutton shops in Uttarakhand

Bears Raid On Meat Shops : మొన్నామధ్య మద్యం షాపులపై ఓ కోతి దాడి చేసి బాటిల్స్ ఎత్తుకుపోయి తాగేస్తోందని వార్తలు హల్ చల్ చేశాయి. ఇప్పుడు తాజాగా ఎలుగు బంట్లు ఏకంగా చికెన్, మంటన్ షాపులపై దాడి చేసి అక్కడున్న మాంసాన్ని తినేస్తున్నాయి. చేపల్ని గుటకాయస్వాహా చేస్తున్నాయి. నానా రచ్చా చేస్తున్నాయి. దీంతో ఆయా షాపుల యజమానులు లబోదిబోమంటున్నారు. ఎందుకంటే అవి ఎలుగు బంట్లాయే..కొట్టటానికి వెళితే ఎదురు దాడి చేస్తున్నాయి. దీంతో మాంసం షాపుల యజమానులు హడలిపోతున్నారు.

అడవులకు సమీపంలో ఉన్న గ్రామాలకు ఎలుగుబంట్లు వచ్చి మనుషులపై దాడి చేసిన ఘటనల గురించి విన్నాం..కొంతమంది అనుభవించికూడా ఉంటారు. కానీ ఉత్తరాఖండ్‌లోని పౌఢీ-కోట్‌ద్వార్‌ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఆగ్రోడా కస్బా ప్రాంతంలో మాత్రం ఎలుగుబంట్లు మాంసాహార దుకాణాలపై దాడి చేస్తున్నాయి.

అక్కడ ఉన్న కోళ్లు, చేపల్ని తినేస్తున్నాయి. ఆ తర్వాత దుకాణ పరిసరాల్లో రచ్చరచ్చ చేస్తున్నాయి. దీంతో మాంసం వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అటవీశాఖ అధికారులకు..జిల్లా యంత్రాంగానికి తమ గోడు మొరపెట్టుకున్నారు. కానీ వారు
ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ఇక షాపులు బంద్ చేసుకోవాల్సిందేనా అని వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలు కావటం వల్లనే అధికారులు పట్టించుకోవట్లేదని పరిస్థితి ఇలాగే ఉంటే తమ జీవనోపాధి దెబ్బతింటుందని వాపోతున్నారు.