వండర్..నీటి గ్లాసులతో గరగర తిప్పాడు…ఒక్క చుక్క నీళ్లు కిందపడలేదు

  • Published By: madhu ,Published On : July 4, 2020 / 01:45 PM IST
వండర్..నీటి గ్లాసులతో గరగర తిప్పాడు…ఒక్క చుక్క నీళ్లు కిందపడలేదు

ఓ యువకుడు రోడ్డుపై నిలబడ్డాడు. తక్కెడలాగా ఉన్నట్లు రెండు ప్లేట్లు తాళ్లతో కట్టాడు. ఆ ప్లేట్లపై గ్లాసులు పెట్టాడు. అందులో నీళ్లు పోశాడు. అనంతరం అమాంతం తాళ్ల సహాయంతో పైకి లేపాడు. గిర..గిరా..ఇష్టమొచ్చినట్లు తిప్పాడు. అయ్యో..గ్లాసులు, నీళ్లు పడిపోతాయి..కదా..అని అనుకుంటున్నారు..ఒక్క నీళ్ల చుక్క, గ్లాసులు కూడా కింద పడిపోలేదు. అంతా వండర్. నిజంగా దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తోంది. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో కొంతమంది టాలెంట్ చూపిస్తున్నారు. ఫీట్లు చేస్తూ..సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అందరి ప్రశంసలూ పొందుతున్నారు. చెన్నైకి చెందని ఓ కుర్రాడు..ఎవరూ ఊహించని విధంగా ప్రదర్శన ఇచ్చాడు.

రెండు గ్లాసుల్లో నిండా నీరు పోసి..తాళ్ల సహాయంతో గ్లాసులను వేలాడదీసి..అన్ని వైపులా గిర్రగిర్రున తిప్పాడు. కానీ…గ్లాస్ తిరగబడితే..నీళ్లు కింద పడాలి..గ్లాసు కింద పడాలి కదా..అని అనుకుంటారు. కానీ ఇక్కడే ఓ టెక్నిక్ చేశాడు. ఇందుకు ఫిజిక్స్‌లో ఆన్సర్ ఉంది.
స్పీడుగా గ్లాసులను తిప్పుతుండడంతో..నీటిలో భూమ్యాకర్షణ శక్తి క్షణక్షణానికి మారిపోతుందని, నీరు కిందపడేలోపే..గ్లాస్ తిరగబడుతోంది.

అందు వల్ల నీరు తిరగి గ్లాస్ లోకే వెళుతోంది. అదే…అతను స్లోగా తిప్పితే మాత్రం ఖచ్చితంగా నీరు, గ్లాసులు కిందపడిపోవడం ఖాయమంటున్నారు. ఈ ఫార్ములాను పక్కాగా ఉపయోగించి సక్సెస్ అయ్యాడు. పలువురు నెటిజన్లు సూపర్ బాస్..అంటూ కితాబిస్తున్నారు.

 

Read:పానీపూరీ కావాలా నాయనా…వెండింగ్ మిషన్ లో రూ.20 నోటు పెట్టండి..గోల్ గప్పా ప్రత్యక్షం